Virat Kohli : కోహ్లీపై విమ‌ర్శ‌లు, ప్ర‌శంస‌లు.. నాణ్యమైన విత్త‌నాలు నాటావంటూ అశ్విన్ కామెంట్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Virat Kohli : కోహ్లీపై విమ‌ర్శ‌లు, ప్ర‌శంస‌లు.. నాణ్యమైన విత్త‌నాలు నాటావంటూ అశ్విన్ కామెంట్

Virat Kohli : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఎన్నో అవరోధాలు, మరెన్నో రివార్డులు అందుకున్నాడు. 2014-15 ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి..ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అన్ని ఫార్మట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు సారధ్యం వహించాడు. నెమ్మదిగా ఒక్కొక్క ఫార్మట్ బాధ్యతల్నించి వైదొలిగాడు. అయితే కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత విరాట్ కోహ్లీపై విమ‌ర్శ‌ల‌తో పాటు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 January 2022,1:00 pm

Virat Kohli : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఎన్నో అవరోధాలు, మరెన్నో రివార్డులు అందుకున్నాడు. 2014-15 ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి..ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అన్ని ఫార్మట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు సారధ్యం వహించాడు. నెమ్మదిగా ఒక్కొక్క ఫార్మట్ బాధ్యతల్నించి వైదొలిగాడు. అయితే కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత విరాట్ కోహ్లీపై విమ‌ర్శ‌ల‌తో పాటు ప్ర‌శంస‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి.క్రికెట్‌లో కెప్టెన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. వారు నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘన విజయాల గురించే మాట్లాడుతుంటారు.

‘ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, శ్రీలంకల్లో కోహ్లీ గొప్ప విజయాలు సాధించాడు. భారత క్రికెట్లో కెప్టెన్‌గా అతను నెలకొల్పిన బెంచ్‌మార్క్‌లను కొనసాగించడం ఏ నాయకుడికైనా కష్టమే. విజయాలు అనేవి పంటకు ముందు మనం నాటిన విత్తనాల ఫలితమే. టీమిండియా విజయాల కోసం కోహ్లీ నాణ్యమైన విత్తనాలను నాటాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడని కొనియాడాడు అని ర‌విచంద్ర‌న్ అశ్విన్ ప్ర‌శంస‌లు కురిపించాడు.విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో 55 టెస్టులు ఆడిన అశ్విన్‌ 293 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ సత్తా చాటి మూడు సెంచరీలు నమోదు చేశాడు.

ashwin praises on Virat Kohli

ashwin praises on Virat Kohli

Virat Kohli కోహ్లీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం..

ఇక పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ సైతం కోహ్లీని ప్రశంసించాడు. ‘భవిష్యత్తు తరాలకు నిజమైన నాయకుడు విరాట్ కోహ్లీ. యువ ఆటగాళ్లకు నువ్వు ఆదర్శం. మైదానంలో నీ దూకుడు కొనసాగాలి’ అని ఆమీర్ ట్వీట్ చేశాడు. కాగా, టీమ్ ఇండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ కోసం గతలో ఏ కెప్టెన్ చేయనంత మెరుగ్గా బేసిక్ ప్రిన్సిపల్‌ను ప్రవేశపెట్టాడు. బ్యాటింగ్ లైనప్‌తో పాటు 5గురు ప్రధాన బౌలర్లు ఉండాలనేది విరాట్ కోహ్లి ఆలోచనగా సాగింది. 2015లో శ్రీలంక పర్యటనలో కోహ్లీ ఐదుగురు బౌలర్లను రంగంలో దింపాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది