Rohit Sharma – Virat Kohli : రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లపై బీసీసీఐ సంచలన ప్రకటన….?
Rohit Sharma – Virat Kohli : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిపాలుు కావడంతో బీసీసీఐ ప్రక్షాళనకు పోనుకుంది. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ని రద్దు చేసిన బీసీసీఐ. తన ఇప్పుడు జట్టులోని కొన్ని మార్పులకు సిద్ధమైంది. ఇక ప్రస్తుతం శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువర్ క్రికెటర్ లు అందరూ ఆఖరి వన్డే ఆడేందుకు బుధవారం సిద్ధమవుతుండగా … మరోవైపు బంగ్లాదేశ్ పర్యటనకు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ని జట్టు సిద్ధమైంది. అయితే ఈ టూర్ కి ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో బీసీసీఐ పెద్దలు సమావేశం అవుతున్నట్లు సమాచారం.
ఇక ఈ సమావేశానికి ముందు మరో సంచలనమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లను ఇకమీదట టి20 మ్యాచ్ లకు ఎంపిక చేసేది లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. ఇక ఈ విషయాన్ని బీసిసిఐ అధికారి ఒకాయన మీడియాకు వెల్లడించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టి20 వరల్డ్ కప్ 2024 లోపు మరో కొత్త టీమిండియా క్రికెటర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం . ఇక రోహిత్ శర్మను మరియు విరాట్ కోహ్లీని వన్డేలు మరియు టెస్టు మ్యాచ్ లకు పరిమితం చేసి టి 20 మ్యాచ్లకు హార్దిక్ పాండ్యాలో కెప్టెన్ గా , మరో సరికొత్త టీమిండియాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. అలాగే కేవలం యువ క్రికెటర్లు తో కూడిన జట్టును మాత్రమే టి20 లో ఆడించాలని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారని సమాచారం.
అయితే ఈ విషయాన్ని ముందుగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లకు వివరించి, ముందుకు వెళ్లాలని అందుకే బంగ్లాదేశ్ పర్యటనకు ముందే వీరందరూ సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రోహిత్ శర్మ విషయంలో క్రికెట్ పెద్దలు ఆలోచిస్తున్న దానికి క్రికెట్ అభిమానులు స్పందించడం లేదు కానీ, రన్ మిషన్ విరాట్ కోహ్లీ విషయంలో ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. విరాట్ కోహ్లీ సీనియర్ క్రికెటర్ అయినా సరే అందరికంటే అతనే ఎక్కువ ఫీట్ గా ఉంటాడని, అలాగే ఇంతవరకు ఒక్కసారి కూడా గాయంతో ఎన్ సీఐ కు వెళ్ళని ఒకే ఒక్క ఇండియన్ ఆటగాడు విరాట్ కోహ్లీ అని అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం ఏమాత్రం మంచిది కాదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.