BCCI : టీమిండియాలో ముగ్గురు ఆటగాళ్లకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న బీసీసీఐ… వరల్డ్ కప్ కూడా కష్టమే..?
BCCI : ఇటీవల T20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ దాకా వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో జట్టు ఓడిపోవడం పట్ల ఎక్కువగా సీనియర్లపైనే విమర్శలు రావడం జరిగాయి. సీనియర్లు బద్దకంగా ఆడటం వల్లే ప్రపంచ కప్ ఓటమిపాలైందని అనేకమంది విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు బీసీసీఐ వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ పై ప్రత్యేకమైన దృష్టి సారించింది. దీంతో ఇప్పటి నుంచే […]
BCCI : ఇటీవల T20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ దాకా వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో జట్టు ఓడిపోవడం పట్ల ఎక్కువగా సీనియర్లపైనే విమర్శలు రావడం జరిగాయి. సీనియర్లు బద్దకంగా ఆడటం వల్లే ప్రపంచ కప్ ఓటమిపాలైందని అనేకమంది విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు బీసీసీఐ వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ పై ప్రత్యేకమైన దృష్టి సారించింది. దీంతో ఇప్పటి నుంచే కసరత్తులను మొదలుపెట్టింది. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ భారత్ వేదికగా జరుగుతూ ఉండటంతో టీం ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ టోర్నీ తీసుకుంది.
2011లో సొంత గడ్డపై గెలిచి విశ్వవిజేతగా నిలవడంతో ఈసారి.. కూడా హిస్టరీ రిపీట్ చేయాలని బీసీసీఐ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. ఈ క్రమంలో జట్టులో లోపాలను పరిశీలిస్తూ.. ప్రధానంగా బౌలింగ్ పై దృష్టి సారించడం జరిగింది. భారీ స్కోర్లు కొడుతున్నా గానీ… మన బౌలర్లను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు చెడుగుడు ఆడుతూ ఉండటంతో… బౌలింగ్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఈ పరిణామంతో కొంతమంది ఆటగాలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యి.. ముగ్గురిని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేయర్లు ఎవరంటే శిఖర్ ధావన్, రిశబ్ పాంత్….బౌలర్ శార్దూల్ టాకుర్. శిఖర్ ధావన్.. వయసు డిసెంబర్ 37 సంవత్సరాలు వస్తూ ఉండటంతో… ప్రపంచ కప్ సెలక్షన్ కి ముందుగానే పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం టీంలో ఉన్నా గాని నీలకడగా ఆడటం లేదు. ఓపెనర్ గా కూడా సరైన స్ట్రైక్ రేట్ లేదు. రిశబ్ పాంత్ విషయానికొస్తే ప్రస్తుతం ఫామ్ లో లేడు. దీంతో బయట నుండి అతని పక్కనే పెట్టాలని తీవ్రస్థాయిలో బీసీసీపై ఒత్తిడి వస్తుంది. అతని స్థానంలో యాంగ్ ప్లేయర్ శాంసంన్ కి అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇంకా మూడో ప్లేయర్ శార్దూల్ టాకుర్ విషయానికొస్తే.. ఆల్ రౌండర్ ఆటగాడు అయినా గాని ఎప్పుడూ ఆడతాడో… ఎప్పుడు విఫలమవుతాడో… అతనికే తెలియదు. మనోడికి నిలకడ ఉండదు. మరోపక్క బుమ్రా… రేపో మాతో రీఎంట్రీ అవ్వడానికి రెడీ అవుతూ అవుతున్నాడు. ఈ క్రమంలో మరి కొంతమంది బౌలర్స్ అందుబాటులో ఉండటంతో శార్దూల్ టాకుర్ నీ.. ప్రపంచ కప్ జట్టు నుండి తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.