Rohit Sharma : రోహిత్ శర్మ కి షాక్ ఇవ్వనున్న బీసీసీఐ..సెమీ ఫైనల్ ఓటమి ఎఫెక్ట్ టీమిండియాకి కొత్త కెప్టెన్..?
Rohit Sharma : T20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ లో ఇండియా ఓటమి చెందడం తెలిసిందే. లీగ్ దశలో ఐదు మ్యాచ్ లలో నాలుగు గెలవడం జరిగింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లేదా బ్యాటింగ్ పరంగా దేనిలోనూ సత్తా చాటలేకపోయారు. భారత్ ఓపెనర్స్ ఇంకా భారత్ పెసర్లు ఎవరు కూడా సెమీఫైనల్ మ్యాచ్ లో న్యాయం చేయలేకపోయారు. ఫలితంగా ఇంగ్లాండ్ ఓపెనర్స్… ఒక్క […]
Rohit Sharma : T20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ లో ఇండియా ఓటమి చెందడం తెలిసిందే. లీగ్ దశలో ఐదు మ్యాచ్ లలో నాలుగు గెలవడం జరిగింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లేదా బ్యాటింగ్ పరంగా దేనిలోనూ సత్తా చాటలేకపోయారు. భారత్ ఓపెనర్స్ ఇంకా భారత్ పెసర్లు ఎవరు కూడా సెమీఫైనల్ మ్యాచ్ లో న్యాయం చేయలేకపోయారు.
ఫలితంగా ఇంగ్లాండ్ ఓపెనర్స్… ఒక్క వికెట్ పడకుండా భారత్ పేసర్లను చితక్కొట్టారు. 169 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే చేదించారు. పరిస్థితి ఇలా ఉంటే సెమీఫైనల్ ఓటమి తర్వాత బీసీసీఐ సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. సెమీఫైనల్ ఓటమితో జట్టులో మార్పులు చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో టి20 మ్యాచ్ లకి లాంగ్ టర్మ్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా నీ నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అలాగే సీనియర్లను వచ్చే ఏడాది టి20 లో ఆడించే అవకాశం లేదని… బీసీసీఐ అధికారి ఒకరు అంటున్నారు. రిటైర్మెంట్ ప్రకటించకపోయినప్పటికీ ఎంపిక చేసే అవకాశం లేదని సమాచారం. మరి ముఖ్యంగా రోహిత్, విరాట్, అశ్విన్ లను క్రమంగా టి20లకు దూరం చేయాలని డిసైడ్ అయ్యారట. మరి ముఖ్యంగా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినాటి నుండి రోహిత్ శర్మ ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతో పాటు ఒత్తిడికి గురవుతుండటంతో… కెప్టెన్ గా రోహిత్ శర్మాని పక్కన పెట్టడానికి బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.