Ishan Kishan : రికార్డులన్నీ బద్దలు.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బంగ్లాతో మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్..!!
Ishan Kishan : బంగ్లాదేశ్ టూర్ లో ఉన్న టీమిండియా వరుసగా రెండు వన్డేలు ఓడిపోవడం తెలిసిందే. పసికూన లాంటి బంగ్లాదేశ్ తో రెండు ఉండేలా ఓడిపోవడంతో వన్డే సిరీస్.. బంగ్లా కైవసం చేసుకుంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా చివరి రోజు ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో .. పరువు నిలుపుకోవడానికి.. భారత్ బరిలోకి దిగి భారీ స్కోరు నమోదు చేసింది. ఇషాన్ చెలరేగి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.134 బంతులలో 210 పరుగులు చేసి డబ్బులు
సెంచరీ సాధించి క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఇషాన్ తో పాటు విరాట్ కోహ్లీ 113… పరుగులు చేసి సెంచరీతో చెలరేగిపోయాడు. ఇద్దరూ బంగ్లా బౌలర్లనీ చితక బాదారు. ఇక ఇదే మ్యాచ్ లో ధావన్ (3), శ్రేయాస్(3), రాహుల్(8), అక్షర్ (20) కొద్ది పరుగులు మాత్రమే చేసినా గానీ చివరిలో.. సుందర్ 37 పరుగులు చేయటం జరిగింది. బంగ్లాతో చివరి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 409 బంగ్లాకి టార్గెట్ ఇవ్వడం జరిగింది.
అంతర్జాతీయంగా ఇప్పటివరకు 9 డబుల్ సెంచరీలు నమోదు కాగా అందులో భారత్ నుండే నలుగురు బ్యాట్స్ మెన్ లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్… క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్..138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా. ఇషాన్… 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి గేల్ రికార్డ్ బ్రేక్ చేయడం విశేషం. ఇషాన్.. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 134 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ లు కొట్టి మొత్తంగా 210 పరుగులు చేయడం జరిగింది.