Champions Trophy : బంగ్లాదేశ్‌తో ఆడే భారత జట్టులో ఎవరెవరు ఉన్నారు… ఎవరు ఔట్..!
ప్రధానాంశాలు:
Champions Trophy : బంగ్లాదేశ్‌తో ఆడే భారత జట్టులో ఎవరెవరు ఉన్నారు... ఎవరు ఔట్..!
Champions Trophy : ఈ రోజు నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ICC Champions Trophy 2025 మెగా టోర్నీకి తెరలేసింది. ఈరోజు మధ్యాహ్నం పాక్-కివీస్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుంది. రేపు india vs bangladesh బంగ్లాదేశ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక ఈసారి టోర్నీ హైబ్రిడ్ మోడ్ లో పాకిస్థాన్, దుబాయ్ లో జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా తన మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడనుంది.

Champions Trophy : బంగ్లాదేశ్‌తో ఆడే భారత జట్టులో ఎవరెవరు ఉన్నారు… ఎవరు ఔట్..!
Champions Trophy : బంగ్లాదేశ్‌తో ఆడే భారత జట్టు ఇదే
ఈ టోర్నీకి బుమ్రా గైర్హాజరు అవుతాడనే టాక్ నడుస్తుంది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు వన్డేల్లో పెద్దగా అనుభవం లేకపోవడం.. మహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకుని ఇటీవలే రీఎంట్రీ ఇవ్వడంతో పేస్ విభాగంపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. వీరు ఏం చేస్తారా అనే సందేహం కూడా ఉంది.
ముందుగా బౌలింగ్ చేస్తే స్పిన్నర్ల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండనుంది. కండిషన్స్‌కు తగ్గట్లు బౌలింగ్ విభాగంలో మార్పులు చేయనున్నారు.మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది. వరుణ్‌కే ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కాగా, భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.