David Warner : డేవిడ్ వార్నర్‌కి పెద్ద ప్రమాదమే తప్పింది.. లేదంటే తల పగిలిపోయేది..!
ప్రధానాంశాలు:
David Warner : డేవిడ్ వార్నర్‌కి పెద్ద ప్రమాదమే తప్పింది.. లేదంటే తల పగిలిపోయేది..!
David Warner : ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ David Warner తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. మన హీరోల సినిమాల పాటలకి ఎక్కువగా రీల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. డేవిడ్ వార్నర్ క్రీజులోకి అడుగు పెడుతున్నాడంటేనే అపోజిషన్ బౌలర్లు వణుకుతారు. బౌండరీల మోతతో ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడతారు. అతడి ఊచకోత నుంచి ఎలాగైనా తప్పించమని దేవుడ్ని కోరుకుంటారు. అంతలా ప్రత్యర్థులతో ఆడుకుంటాడు డేవిడ్ భాయ్.
David Warner పెద్ద ప్రమాదమే తప్పింది..
అయితే అందర్నీ షేక్ చేసే వార్నర్.. ఒక బంతి దెబ్బకు వణికిపోయాడు. అతడు కొంచెంలో బతికిపోయాడు. అదృష్టం బాగుండటంతో బతికి బయట కట్టాడు. కాస్త అటు ఇటైనా డేవిడ్ భాయ్ ఫుల్ డేంజర్‌లో పడేవాడు. సిడ్నీ థండర్స్, హోబార్డ్ హరికేన్స్ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్.. తన బ్యాట్‌తో తన తలపై బాదుకున్నాడు. అయితే ఇది కావాలని చేసింది కాదు. బౌలర్వే Bowlerసిన బంతిని బౌండరీ బాదే క్రమంలో ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌లో డేవిడ్ వార్నర్ సిడ్నీ థండర్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, హోబార్ట్ హరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హోబార్ట్ హరికేన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో డేవిడ్ వార్నర్ సేన బ్యాటింగ్‌కు దిగింది. అయితే రిలే మెరిడిత్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది.బంతి తగలగానే బ్యాట్ హ్యాండిల్ దగ్గర విరిగిపోయింది. అనంతరం బ్యాట్ తిరిగి వెళ్లి వార్నర్ హెల్మెట్ వెనకభాగం వైపు తాకింది. అయితే బంతి హెల్మెట్‌కు తగిలాక వార్నర్ షాక్ అయ్యాడు. ఈ ఘటనలో అతడికి స్వల్పంగా దెబ్బతలిగింది. కానీ హెల్మెట్ Helmet ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.