DC vs Pbks :టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్‌… ఢిల్లీ 6 ఓవ‌ర్ల‌కు 54/1 | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

DC vs Pbks :టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్‌… ఢిల్లీ 6 ఓవ‌ర్ల‌కు 54/1

DC vs Pbks  :  indian premier league 2024 ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పుకోవాలి. ఇక సమ్మర్ లో సూపర్ గా అలరించే ఐపీఎల్ సీజన్-17 శుక్రవారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. తొలిరోజు సీఎస్ కే వర్సెస్ బెంగుళూరు జట్టులు ఆడాయి. ఇందులో అనూహ్యంగా చెన్నై జట్టు గెలిచింది. ఇక శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  DC vs Pbks : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్‌...!

DC vs Pbks  :  indian premier league 2024 ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పుకోవాలి. ఇక సమ్మర్ లో సూపర్ గా అలరించే ఐపీఎల్ సీజన్-17 శుక్రవారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. తొలిరోజు సీఎస్ కే వర్సెస్ బెంగుళూరు జట్టులు ఆడాయి. ఇందులో అనూహ్యంగా చెన్నై జట్టు గెలిచింది. ఇక శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్ జట్లు పాల్గొనబోతున్నాయి. Punjab Kings పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో గత మహారాజా యదవీంద్రసింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. దాంతో ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది.

అయితే ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టే ఉన్నాయి. దాంతో ఈ రెండు జట్టలో ఎవరు గెలుస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏంటని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరిబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు Delhi Capitals ఢిల్లీకి రిషబ్ పంత్ రాకతో కాస్త బలం పెరిగింది. కానీ అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని అంటున్నారు. కానీ ఎలా ఆడుతాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అటు ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఉన్నారు. కాబట్టి వారు మంచి ఓపెనింగ్ రన్స్ ఇవ్వగలరని నమ్ముతున్నారు అంతా కూడా.

కానీ పృథ్వీ షా ఇప్పుడు జట్టులో లేడు. కానీ వార్నర్ మీదనే భారం ఉంది. ఇక అటు మిగతా బ్యాట్స్ మెన్స్ పరంగా చూసుకుంటే రిషభ్‌ పంత్‌, హ్యారీ బ్రూక్‌, మిచెల్‌ మార్ష్‌, అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. వీరంతా బాగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్లే. అటు బౌలింగ్ లో కూడా బాగానే ఉన్నారు. మిచెల్‌ మార్ష్‌, అక్షర్‌ పటేల్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముఖేస్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, అన్రిచ్‌ నోర్జేతో బౌలింగ్‌ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ వీరు గ్రౌండ్ లో ఎలా ఆడుతారో అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ టీమ్ మొత్తానికి బ్యాటింగ్ పరంగాబాగానే ఉంది. కానీ బౌలింగ్ పరంగా చాలా వీక్ గా ఉంది.

DC vs Pbks టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్‌

DC vs Pbks : టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న పంజాబ్‌…!

పంజాబ్ జట్టులో శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీ చేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే శిఖర్‌ ధావన్‌, ప్రభుసిమ్రాన్‌ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే ఛాన్స్‌ ఉంది. కానీ ఢిల్లీతో పోలిస్తే ఓపెనర్లు బలంగా లేరు. తర్వాతి బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తే.. లిమ్‌ లివింగ్‌ స్టోన్‌, బెయిర్‌ స్టో, రిలీ రోసోవ్‌, జితేష్‌ శర్మ ఉన్నారు. వీరిలో ముగ్గురు ఫారెన్‌ ప్లేయర్లు ఉన్నారు. వీరు పెద్దగా ఆడే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఇక క్రిస్‌ వోక్స్‌, సామ్‌ కరన్‌, సికందర్‌ రజా లాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. బౌలింగ్ విషయానికి వస్తే.. అర్షదీప్‌ సింగ్‌, కగిసో రబాడ, రాహుల్‌ చాహర్‌ ప్రధాన బలంగా ఉన్నారు. బౌలింగ్, ఆల్ రౌండర్ పరంగా బాగానే ఉన్నా.. ఓపెనర్లు మాత్రం అంత బలంగా లేరు. కానీ పంజాబ్ గట్టిగా పోరాడితే మాత్రం కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది