Dinesh Karthik : సచిన్ టెండుల్కర్ సెంచరీని అడ్డుకున్న దినేశ్ కార్తీక్.. వీడియో వైరల్
Dinesh Karthik : ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ ను చేజిక్కించుకుంది టీమిండియా. తాజాగా దక్షిణాఫ్రికాపై జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా రెచ్చిపోయింది. రెండో టీ20లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ అయినప్పటికీ.. దక్షిణాఫ్రికాపై 2 – 0 తో భారత్ టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. మరోవైపు కోహ్లీని క్రికెట్ అభిమానులు తెగ పొగుడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అలాగే సచిన్ టెండుల్కర్ పై కూడా నెగెటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లీ నిస్వార్థ పరుడని.. సచిన్ టెండుల్కర్ మాత్రం స్వార్థపరుడు అంటూ చెప్పుకొస్తున్నారు. దానికి ఉదాహరణగా ఎప్పుడో 19 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు. సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ.. 2003 లో గౌహతిలో జరిగిన భారత్, శ్రీలంక మ్యాచ్ గురించే అందరూ చెబుతున్నారు. ఆ మ్యాచ్ లో సచిన్ 96 పరుగులు చేశాడు. నాటౌట్ గా నిలుస్తాడు. నిజానికి.. సచిన్ సెంచరీ పూర్తి చేయకుండా దినేష్ కార్తీక్ అడ్డుపడతాడు. దీంతో సచిన్ కు కోపం వచ్చి దినేష్ కార్తీక్ ను ఏదో అన్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. నిన్నటి మ్యాచ్ లోనూ అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Dinesh Karthik : ఒక్క పరుగు చేస్తే హాఫ్ సెంచరీ.. కానీ వద్దన్న కోహ్లీ
చివరి ఓవర్.. విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇంకో పరుగు చేస్తే హాఫ్ సెంచరీ చేస్తాడు. కానీ.. ఇంతలో దినేశ్ కార్తిక్ స్ట్రైకింగ్ కు వచ్చాడు. నాలుగు బాల్స్ ను ఆడాడు. ఇక రెండు బంతులు మిగిలి ఉన్నాయి. నాన్ స్ట్రైక్ లో ఉన్న కోహ్లీ దగ్గరికి వెళ్లాడు డీకే. స్ట్రయిక్ కావాలా అని అడిగాడు. కానీ.. కోహ్లీ మాత్రం వద్దు. నువ్వు ఆడు అని చెప్పాడు. ఇది.. నిజమైన ఆటగాడి లక్షణం. కోహ్లీ నిజంగా నిస్వార్థపరుడు అంటూ కోహ్లీ అభిమానులు.. అప్పట్లో సచిన్ తో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ..దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Pic1 : SachinTendulkar Angry On DK For Not Letting Him Complete His Century When Sachin Tendulkar Was Batting On 96*
Pic2: Virat Kohli Telling DK to Carry on Scoring Boundaries and Not Take A Deliberate Single When Virat was batting on 49*????❤@DineshKarthik ❤️
#INDvsSA pic.twitter.com/FlBtBAZPVa
— VR (@VinayKiccha_) October 2, 2022