Semi Final Match : సెమీస్‌లో తలపడనున్న భారత్ – ఇంగ్లండ్.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ వెళ్లేదెవరు..!
ప్రధానాంశాలు:
Semi Final Match : సెమీస్‌లో తలపడనున్న భారత్ - ఇంగ్లండ్.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ వెళ్లేదెవరు..!
Semi Final Match : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 మ్యాచ్‌లు ముగియడంతో సెమీఫైనల్ రేసు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-1 నుంచి ఏ జట్టు తదుపరి దశకు అర్హత సాధిస్తుందా అనే ఉత్కంఠ నడుమ అఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాపై గెలిచి సెమీస్ కి వెళ్లింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లింది. దీంతో 2022 టీ20 వరల్డ్ కప్ సీన్ రిపీట్ అయింది. అప్పుడు భారత్‌పై ఇంగ్లాండ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కి వెళ్లింది. ప్రస్తుత టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమ్ ఇండియా, ఇంగ్లీష్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
Semi Final Match భారత్ కే అవకాశాలు..
జూన్ 27న భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 28న ఫైనల్ జరగనుంది. ఇంగ్లండ్ చివరిసారిగా సెమీ ఫైనల్స్‌లో టీమిండియాను ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం భారత్‌కు దక్కింది. కాని ఇంగ్లండ్ జట్టు భీబత్సంగా ఆడుతుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు మోన్‌స్టర్స్‌లా చెలరేగిపోతున్నారు. ఒమన్‌పై 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదించింది. అమెరికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లోనూ 116 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే అందుకుంది. ఇప్పుడు ఆ డేంజరస్ ఇంగ్లండ్‌ను భారత్ సెమీస్‌లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సెమీస్ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ వర్షం వలన సెమీస్ మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు వెళతారు అనేది ఆసక్తికరంగా మారింది.

Semi Final Match : సెమీస్‌లో తలపడనున్న భారత్ – ఇంగ్లండ్.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ వెళ్లేదెవరు..!
ఒక్క బంతి కూడా వేయకుండానే గేమ్ వాష్ అవుట్ అయితే, సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న భారత్ నేరుగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరే అవకాశం. మ్యాచ్ పూర్తిగా జరగకపోతే ఇండియా జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రినిడాడ్‌లో జూన్ 26న జరిగే మొదటి సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. ఈ మ్యాచ్ నైట్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ మ్యాచ్ క్యాన్సిల్ అయితే, తర్వాతి రోజు డే టైమ్‌లో గేమ్ జరుగుతుంది. అయితే గయానాలో జూన్ 27న జరిగే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెంఓ సెమీస్ ఉదయం జరుగుతుంది. దానికి రిజర్వ్ డే లేదు. వాష్ అవుట్ అయితే రిజల్ట్ అనౌన్స్ చేయడానికి 2.30 గంటల ఎక్స్‌ట్రా టైమ్ తీసుకుంటారు. ఆ లోపు మ్యాచ్ నిర్వహించలేకపోతే, క్యాన్సిల్ అయినట్లు ప్రకటిస్తారు. దాంతో భారత్ ఫైనల్‌కి చేరుకోవడం ఖాయం. మ్యాచ్ పూర్తిగా రద్దైతే జూన్ 29న శనివారం బార్బడోస్‌లో జరిగే ఫైనల్‌కి భారత్ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.