Virat Kohli : సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం చాలా చిన్నది.. దీనిని ఆపితే భారత క్రికెట్‌కి మంచి రోజులొచ్చినట్టే…!
Virat Kohli : గత కొద్ది రోజులుగా భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. ముఖ్యంగా కోహ్లీ విషయంలో గంగూలీ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి గంగూలీ మాట్లాడుతూ… పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే సారథి ఉండాలన్న భావనతో సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. తాను టీ20 కెప్టెన్సీ వైదొలగవద్దని చెప్పినా కోహ్లి వినలేదని, అందుకే ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లి ఈ వ్యాఖ్యలను ఖండించాడు. తనను ఎవరూ సంప్రదించలేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో గంగూలీ తీరుపై విమర్శల జడి కురిసింది.
అయితే కోహ్లీ, గంగూలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని , అది కనుక సెట్ అయితే భారత క్రికెట్ కి మంచి రోజులు వచ్చినట్టే అని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి అనాలోచిత నిష్క్రమణ బీసీసీఐతో అతని సంబంధాన్ని ప్రశ్నార్థకం చేసిందంటూ కామెంట్ చేశాడు. చాలా మంది మాజీలు కూడా ఈ సమస్యపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కోహ్లి, బీసీసీఐ మధ్య చీలిక అంత మంచిది కాదని, దీనికోసం ఇరువర్గాలు ఒక అడుగు దిగి మాట్లాడుకుంటే మంచిదంటూ సూచనలు కూడా చేశారు. తాజాగా గౌతమ్ గంభీర్ కూడా ఈ కోవలోకే చేరాడు.కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలను “అంతర్గత యుద్ధం” గా గంభీర్ అభివర్ణించాడు.
Virat Kohli : అంతర్గత యుద్ధం అంటూ వర్ణించిన గంభీర్..
“ఇది అంతర్గత యుద్ధం. ఇది చాలా చిన్న విషయం. దాని లోతుకు వెళితే, విషయం సులభంగా ఉంటుంది. ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఇరువర్గాలు శాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది” అని టైమ్స్ నౌతో మాట్లాడుతూ గంభీర్ పేర్కొన్నాడు. ఇక రెడ్ బాల్ కెప్టెన్‌గా కోహ్లీ ఉంటే బాగుంటుంది. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం విరాట్ వ్యక్తిగత నిర్ణయం. అతను కొనసాగించాల్సిన అవసరం ఉంది “అని గంభీర్ పేర్కొన్నాడు.ఇక ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ఐలలో తలపడే భారత వైట్-బాల్ జట్టులో కూడా సభ్యుడిగా భాగమయ్యాడు.