IND VS AUS : 20 ఏళ్ల నాటి పగ అది.. 2003 వర్సెస్ 2023.. తగ్గేదేలే అంటున్న భారత్.. ఈసారి ఆస్ట్రేలియాను చిత్తు చేస్తాం అంటున్న భారత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IND VS AUS : 20 ఏళ్ల నాటి పగ అది.. 2003 వర్సెస్ 2023.. తగ్గేదేలే అంటున్న భారత్.. ఈసారి ఆస్ట్రేలియాను చిత్తు చేస్తాం అంటున్న భారత్

 Authored By kranthi | The Telugu News | Updated on :17 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  2003 లో ఐసీసీ వన్డ్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయిన భారత్

  •  2023 ఫైనల్స్ లో మళ్లీ అదే టీమ్ తో తలబడబోతున్న భారత్

  •  భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. గెలుపు ఎవరిది?

IND VS AUS : ఇప్పటిది కాదు.. 20 ఏళ్ల నాటి పగ. అవును.. 2023 ఐసీసీ వన్డే క్రికెట్ కప్ లో భారత్, ఆస్ట్రేలియా ఈ రెండు టీమ్స్ ఫైనల్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రెండు టీమ్స్ ఫైనల్స్ కు వెళ్లడం ఏమో కానీ.. గెలుపు ఎవరిది అంటూ భారీ స్థాయిలో ఈసారి బెట్టింగ్ జరుగుతోంది. కొన్ని వందలు, వేల కోట్ల రూపంలో బెట్టింగ్ జరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు. అయితే.. 2023 లో ఎలాగైతే భారత్, ఆస్ట్రేలియా రెండు టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయో.. 2003 లోనూ అప్పటి వరల్డ్ కప్ లోనూ ఇలాగే భారత్, ఆస్ట్రేలియా రెండు టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. కానీ.. ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా గెలిచి కప్ ఎగురవేసుకుపోయింది. జొహన్నస్ బర్గ్ లో ఈ మ్యాచ్ జరిగింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లో రెండు టీమ్స్ పోటీ పడబోతున్నాయి.

అప్పుడు ఆస్ట్రేలియా కప్ ఎగురవేసుకుపోయింది. కానీ.. ఈసారి మాత్రం సొంత గడ్డ మీద భారత్ 20 ఏళ్ల పగను తీర్చుకోవడానికి సిద్ధం అవుతోంది. అప్పుడు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 359 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 234 పరుగులే చేసింది. అప్పుడు టీమ్ కు కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. ఆస్ట్రేలియా టీమ్ కు రికీ పాంటింగ్ ఉన్నాడు. అయితే.. వాళ్లిద్దరూ మళ్లీ తాజాగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో కలుసుకున్నారు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో వీళ్లు కలుసుకున్నారు. ఈసందర్భంగా వీళ్లు మాట్లాడుకున్నారు. 2003 నాటి ఫైనల్ మ్యాచ్ ను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత సేమ్ టీమ్ రిపీట్ అవుతుండటంతో ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.

IND VS AUS : ఈసారి ఆస్ట్రేలియాను ఓడిస్తాం

అయితే.. ఈసారి మాత్రం గురి తప్పేది లేదని.. ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే అని టీమిండియా పట్టుదలతో ఉంది. అందుకే.. ఫైనల్స్ కు చేరిన ఆస్ట్రేలియాను సొంతగడ్డ మీద మట్టికరిపించి.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ఈసారి భారత్ కైవసం చేసుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది