Gautam Gambhir : అతడే కాబోయే కెప్టెన్… అసలు నిజం బయటపెట్టిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gautam Gambhir : అతడే కాబోయే కెప్టెన్… అసలు నిజం బయటపెట్టిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2022,7:30 pm

Gautam Gambhir : గత కొంతకాలంగా టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే విషయం చర్చాంసనీయంగా మారింది. ఇక ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత జట్టుకు , మూడు ఫార్మేట్ లలో రెగ్యులర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ 35 ఏళ్లు కావడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్ శర్మ మరి కొద్ది రోజుల పాటు మాత్రమే మూడు ఫార్మాట్ లలో కొనసాగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా యువకుల క్రికెట్ గా పిలుచుకునే టి20 ఫార్మేట్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ సరైనవాడు కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పుడు వరల్డ్డ్ కప్ విఫలం అవడంతో ఈ విమర్శలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ ఎవరనేది చర్చాంశానియంగా మారగా… అనూహ్యంగా హార్దిక్ పాండ్య పేరు వెలుగులోకి వచ్చింది. అయితే అంతకు ముందే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్ ఆటగాళ్ల పేర్లు రాగా ఇక ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించి , టైటిల్ ను గెలవడంతో హార్దిక్ కెప్టెన్ గా సరైనవాడు అంటూ చాలామంది చర్చించుకుంటున్నారు. అలాగే చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయితే బాగుంటుందంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Gautam Gambhir about to say future captain

అయితే ఈ క్రమంలో ఇటీవల ఈ విషయంపై గౌతమ్ గంభీర్ స్పందిస్తూ సరికొత్త పేరును వెలుగులోకి తెచ్చి ఆశ్చర్యపరిచాడు. రోహిత్ శర్మ తర్వాత పృద్వి షా కెప్టెన్ అయితే బాగుంటుందంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ పేర్కొనబడిన మాటలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. పృద్వి షా కు జట్టులో ఆడడానికి చోటు లేదు కానీ న్ కెప్టెన్ ఎలా అవుతాడు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట ట్రేండింగ్ గా మారింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది