Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు కస్టమ్ అధికారుల షాక్.. కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు స్వాధీనం..
Hardik Pandya : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ నెల 14న నైట్ టైంలో దుబాయ్ నుంచి హార్దిక్ పాండ్యా వస్తుండగా, అతడిని ఆపేశారు. ఈ క్రమంలోనే ఏం జరిగిందంటే..దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన హార్దిక్ పాండ్యా.. ముంబై ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఈ క్రమంలోనే కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న వస్తువులను తనిఖీ చేశారు. రూ.5 కోట్ల విలువ చేసే రెండు గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయమై కస్టమ్స్ అధికారులు మీడియాకు తెలిపారు. టీ20 వరల్డ్ కప ఆడి స్వదేశానికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. దుబాయ్‌లో కొనుగోలు చేసినటువంటి కాస్ల్లీ వాచెస్ ఇన్ వాయిసెస్, బిల్స్ చూపించలేకపోయాడు హార్దిక్. దాంతో రెండు గడియారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో జరిగిన మ్యాచెస్ క్రికెట్ ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు.

hardik pandya mumbai airport officers given shock
Hardik Pandya : సరైన ఆధారాలు చూపకపోవడంతో పలు వస్తువులు స్వాధీనం..
దాంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదరయ్యాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో మూడు ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 69 పరుగులే చేసి, పేలవ ప్రదర్శన ఇచ్చాడు. న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచెస్‌లో తక్కువ పరుగులకే పరిమితమయ్యాడు. ఇకపోతే తన వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలపై హార్దిక్ పాండ్యా స్పందించారు. తాను తీసుకున్న వస్తువులకు సంబంధించిన వివరాలను కస్టమ్స్ అధికారులకు తెలిపానని.
సోషల్ మీడియాలో, మీడియాలో ప్రసారమవుతున్నట్లు తాను కొనుగోలు చేసిన వాచెస్ ప్రైస్ రూ. 5 కోట్లు కాదని, రూ.1.5 కోట్లు ఖరీదు చేసే గడియారాలను తాను కొన్నానని పేర్కొన్నాడు. తాను దేశంలోని చట్టాలను గౌరవిస్తానని, ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్టులో తనిఖీలకు సహకరించానని, కస్టమ్స్ డిపార్ట్ మెంట్ అధికారులకు కస్టమ్ డ్యూటీ చెల్లించానని వివరించాడు.