Hardik Pandya : వరల్డ్ కప్‌కి హార్దిక్ పాండ్యా దూరం.. ఆవేదనతో స్పందించిన ఆల్ రౌండర్.. ఏమన్నాడంటే?
ప్రధానాంశాలు:
ఐసీసీ ప్రపంచ కప్ మిస్ చేసుకున్న హార్దిక్ పాండ్యా
భావోద్వేగానికి గురయిన హార్ధిక్ పాండ్యా
పాండ్యా మళ్లీ జట్టులో చేరిక ఎప్పుడు?
Hardik Pandya : ఇది నిజంగా ఎవ్వరూ ఊహించలేకపోయారు. వరల్డ్ కప్ కు హార్దిక్ పాండ్యా దూరం అవుతాడని పాండ్యా కూడా కలలో అనుకొని ఉండడు. బంగ్లాదేశ్ మ్యాచ్ వరకు మంచి ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా.. బంగ్లాదేశ్ మ్యాచ్ లో బౌలింగ్ వేస్తూ కిందపడ్డాడు. దీంతో తన కాలు మణికట్టు బెనకడంతో కనీసం నడవలేకపోయాడు. గాయంతో వెనుదిరిగాడు. ఏదో చిన్నగాయమే కావచ్చు. కొన్ని రోజుల్లో సెట్ అవుతుందిలే అని అంతా అనుకున్నారు కానీ.. చివరకు ప్రపంచకప్ కే హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వేరే సిరీస్ లు దూరం అయినా పెద్దగా ఎవ్వరూ బాధపడేవాళ్లు కాదు కానీ.. హార్దిక్ పాండ్యా ఐసీసీ వరల్డ్ కప్ కు దూరం అవడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. తాజాగా తాను ప్రపంచకప్ కు దూరం అవ్వడంపై స్పందించాడు. ప్రపంచకప్ కు దూరం అవడం జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. అయినా కూడా తాను ఎప్పటికీ జట్టుతోనే ఉంటానని.. జట్టుతో ఉంటే జట్టు గెలుపునకు వాళ్లను ఉత్సాహపరుస్తానని స్పష్టం చేశాడు పాండ్యా.
నాకు అభిమానులు చాలా మద్దతు ఇచ్చారు. కష్టకాలంలో నా తోడుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తాను. టీమిండియా జట్టు చాలా ప్రత్యేకమైన జట్టు.. అంటూ తనకు మద్దతు ఇచ్చిన వాళ్లకు హార్దిక్ పాండ్యా ధన్యవాదాలు తెలిపాడు. ఎడమ చీలమండకు గాయం కావడం వల్ల అది కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. బౌలింగ్ చేస్తూ ఓవర్ లో మూడు బంతులే వేసి వెనుదిరిగాడు పాండ్యా. ఆ తర్వాత మూడు బంతులు విరాట్ కోహ్లీ వేశాడు. అయితే.. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో పాండ్యా ఆడుతాడని ముందు అంతా భావించారు. మళ్లీ తిరిగి జట్టులో చేరుతాడని.. అప్పటి వరకు గాయం మానుతుందని అనుకున్నారు కానీ.. ఆ గాయం ఇంకా మానకపోవడంతో పాండ్యా ఈ వరల్డ్ కప్ మొత్తం దూరంగా ఉండాల్సి వస్తోందని అతడి గాయంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
Hardik Pandya : పాండ్యా స్థానంలో ఎవరు వస్తున్నారు?
ఇక.. హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండర్ అని అందరికీ తెలిసిందే. పాండ్యా ఉంటే మిడిలార్డర్ పెద్దగా కష్టమేమీ కాదు. మిడిలార్డర్ కూడా భారీగా పరుగులు సాధిస్తుంది. బౌలింగ్ లోనూ పాండ్యా ఇరగదీస్తాడు. కానీ.. ఇప్పుడు పాండ్యా లేకపోవడంతో అన్ని విధాలుగా టీమిండియాకు ఇబ్బందులే రానున్నాయి. ఇక.. పాండ్యా స్థానంలో యువ పేసర్ ప్రసీద్ కృష్ణకు చోటు లభించింది.