Harshit Rana : అన్ని ఫార్మాట్స్ డెబ్యూలో మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షిత్ రాణా రికార్డ్
ప్రధానాంశాలు:
Harshit Rana : అన్ని ఫార్మాట్స్ డెబ్యూలో మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షిత్ రాణా రికార్డ్
Harshit Rana : హర్షిత్ రాణా Harshit Rana.. ఈ బౌలర్ పేరు ఇప్పుడు మారు మ్రోగిపోతుంది. Indian crickter భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన హర్షిత్ రాణా మరోసారి వార్తల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో cricket మూడు ఫార్మాట్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ (టెస్టు, వన్డే, టీ20) తన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఆయన గుర్తింపు పొందాడు. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే విపరీతంగా చర్చనీయాంశంగా మారింది.

Harshit Rana : అన్ని ఫార్మాట్స్ డెబ్యూలో మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షిత్ రాణా రికార్డ్
Harshit Rana క్రేజీ ఫీట్..
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చూపించిన హర్షిత్ రాణా, భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని వేగం, ఎత్తు, మరియు కట్టుదిట్టమైన బౌలింగ్ భారత జట్టులోకి ఎంపికకు కారణమయ్యాయి. హర్షిత్ రాణా తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడాడు. పెర్త్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి, టీమిండియాకు మేలైన ఆరంభాన్ని అందించాడు.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. శివమ్ దూబే గాయపడటంతో హర్షిత్‌కు ఆడే అవకాశం లభించింది. అతను 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేశాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అందులోను 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. ఇలా భారత్ తరఫున అరంగేట్రం చేసిన మూడు ఫార్మాట్‌లలోనూ 3 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా హర్షిత్ రాణా రికార్డు నెలకొల్పాడు.