MS Dhoni : మెద‌డు ప‌ని చేయ‌డం లేదా.. ధోనిపై మాజీ టీమ్ మేట్ ఫైర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MS Dhoni : మెద‌డు ప‌ని చేయ‌డం లేదా.. ధోనిపై మాజీ టీమ్ మేట్ ఫైర్..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  MS Dhoni : మెద‌డు ప‌ని చేయ‌డం లేదా.. ధోనిపై మాజీ టీమ్ మేట్ ఫైర్..!

MS Dhoni : భార‌త క్రికెట్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయం ల‌ఖించుకున్న మ‌హేంద్ర సింగ్ ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కి కొన్నేళ్ల క్రిత‌మే గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు ఐపీఎల్ మాత్ర‌మే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 తాజాగా జరిగిన మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అతిపెద్ద భారీ ఓటమిని (బంతుల పరంగా) అందుకుంది.ఈ ఓటమి తర్వాత ధోనీ మాజీ టీమ్ మేట్ మనోజ్ తీవారీ కొన్ని ప్రశ్నలు సంధించాడు.

MS Dhoni మెద‌డు ప‌ని చేయ‌డం లేదా ధోనిపై మాజీ టీమ్ మేట్ ఫైర్

MS Dhoni : మెద‌డు ప‌ని చేయ‌డం లేదా.. ధోనిపై మాజీ టీమ్ మేట్ ఫైర్..!

MS Dhoni ఎందుకిలా..

గత నాలుగు మ్యాచుల్లో ఆటగాళ్ల ఆటతీరు, నిర్ణయాల్లో లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు పంపడం, అశ్విన్‌ తన వ్యూహాన్ని మార్చి బౌలింగ్ చేయడం, పైగా ధోనీ లాంటి అనుభవజ్ఞుడు ఆటగాడు ఉన్నప్పుడు ఇటువంటి తప్పిదాలు జరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.. పర్పుల్ క్యాప్ విజేత నూర్ అహ్మద్‌ను ఎనిమిదో ఓవర్‌లోనే బౌలింగ్‌కు పంపారు.

అతడు మొదటి బంతికే సునీల్ నరైన్ వికెట్ తీస్తే, మరి అతడిని ముందుగానే ఎందుకు పంపలేదో అర్థం కావడం లేదు. ధోనీ సాధారణంగా ఇలాంటి తప్పిదాలు చేయడు. ఇన్నేళ్లలో అతడ తప్పిదాలు చేసినట్లు నేనెప్పుడు చూడలేదు. మరి ఈసారి ఎందుకు జరిగిందో ధోనీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉంటే ఇలాంటివి జరగకూడదు కదా. కొంపతీసి వాళ్ల మెడదు పని చేయడం ఆగిపోయిందా” అని మనోజ్ తివారీ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది