BCCI : బీసీసీఐ రేంజ్ పెంచిన ఐపీఎల్..!
BCCI : ఎంత ఇంగ్లాండ్ లో పుట్టినా సరే క్రికెట్ కి ఒక క్రేజ్ వచ్చింది అంటే ఇండియా వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ కు కమర్షియల్ హంగులను అద్ది టాప్ ప్లేస్ లో నిలిచేలా చేసింది బీసీసీఐ. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కోసం 2008 లో ఐపీఎల్ ప్రారంభించి క్రికెట్ లీగ్ కు ఫుట్ బాల్ టోర్నీలకు మించి డబ్బులు వచ్చేలా చేసింది. ఐపీఎల్ వల్ల మన ఫేవరెట్ ఆటగాళ్లు కలిసి […]
ప్రధానాంశాలు:
BCCI : బీసీసీఐ రేంజ్ పెంచిన ఐపీఎల్..!
BCCI : ఎంత ఇంగ్లాండ్ లో పుట్టినా సరే క్రికెట్ కి ఒక క్రేజ్ వచ్చింది అంటే ఇండియా వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ కు కమర్షియల్ హంగులను అద్ది టాప్ ప్లేస్ లో నిలిచేలా చేసింది బీసీసీఐ. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కోసం 2008 లో ఐపీఎల్ ప్రారంభించి క్రికెట్ లీగ్ కు ఫుట్ బాల్ టోర్నీలకు మించి డబ్బులు వచ్చేలా చేసింది. ఐపీఎల్ వల్ల మన ఫేవరెట్ ఆటగాళ్లు కలిసి ఆడేలా చేసింది. అఫ్కోర్స్ ఆడినందుకు వారికి కూడా పెద్ద మొత్తం లో డబ్బులు ఇస్తారు. ఐ పీ ఎల్ క్రికెట్ ని పూర్తిగా కమర్షియల్ ఆట గా మార్చేసింది. ఐతే దానితో పాటు క్రికెటర్లకు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఐ పీ ఎల్ లో రాణించిన వారికి టీం ఇండియాలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఐ పీ ఎల్ తోనే ఓవర్ నైట్ స్తార్ అయిన సందర్భాలు ఉన్నాయి. తమ ప్రదర్శన చూపిస్తూనే ఇటు డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఐ పీ ఎల్ ద్వారా బీ సీ సీ ఐ కూడా అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డ్ గా మారింది. ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థయికి బీ సీ సీ ఐ చేరింది. అందుకే బీ సీ సీ ఐ నిర్వహించే ఐ పీ ఎల్ అంత క్రేజ్ తెచ్చుకుంది.
BCCI ఐతే ఐ పీ ఎల్ తరహాలోనే ఇతర దేశాల క్రికెట్ లీగ్..
ఐ పీ ఎల్ తరహాలోనే ఇతర దేశాలు కూడా క్రికెట్ లీగ్ లు మొదలు పెట్టాయి. అయినా సరే ఐ పీ ఎల్ కు వచ్చిన క్రేజ్ రాలేదు. అంతేకాదు ఐ పీ ఎల్ ద్వారా బీ సీ సీ ఐ కి ఆదాయం భారీగా వస్తుంది. టీం ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వా జట్టుకి ఏకంగా 100 కోట్ల రూపాయలు బీ సీ సీ ఐ ప్రైజ్ మజీగా ఇచ్చింది. ఇదంతా ఐ పీ ఎల్ వల్లే అని తెలుస్తుంది.
లాస్ట్ ఇయర్ ఐ పీ ఎల్ వల్ల బీ సీ సీ ఐ 510 కోట్ల ప్రాఫిట్స్ తెచ్చుకుంది. 2022 తో పోల్చితే అది 116 శాతం ఎక్కువ అని తెలుస్తుంది. 2023 లో ఐ పీ ఎల్ ద్వారా 11769 కోట్లు ఆదాయం వచ్చింది. ఐ పీ ఎల్ తో పాటు ఇతర టోర్నీల ద్వారా కూడా ప్రసార హక్కుల ద్వారా బీ సీ సీ ఐ భారీగా సంపాదిస్తుంది. అందుకే హైదరాబాద్ శివారు ప్రాంతంలో వరల్డ్ లెవెల్ ఫెసిలిటీస్ లో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇందుకు పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది.