India vs Australia Final 2023 : ప్రపంచ కప్ 2023 ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ప్రధానాంశాలు:
India vs Australia Final 2023 : ప్రపంచ కప్ 2023 ఫైనల్..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
India vs Australia Final 2023
India vs Australia Final 2023 : ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోరుకు సర్వం సిద్దమైంది. గుజరాత్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా భారత్ తలపడుతున్న విషయం తెలిసిందే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి మొదట బ్యాటింగ్ చేయను న్న భారత్. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లైవ్ లో వీక్షించవచ్చు.
స్టేడియం అభిమానులతో పోటెత్తారు. దేశం నలుమూలలనుంచి ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు- వ్యక్తిగత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటోన్నారు. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లోకి వచ్చింది . అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 150 వన్డేలు జరగగా అందులో భారత్ 57 మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌లు గెలిచాయి. 10 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి.4 ఏళ్లలో ఆస్ట్రేలియా 4 ఫైనల్స్‌లోనూ విక్టరీ సాధించింది. 1996లో శ్రీలంకపై ఫైనల్‌లో ఆస్ట్రేలియా చివరి ఓటమి.