India Vs Pakistan : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ పాకిస్తాన్ జట్లు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

India Vs Pakistan : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ పాకిస్తాన్ జట్లు..?

India Vs Pakistan : T20 వరల్డ్ కప్ వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ 2 నుండి భారత్, పాకిస్తాన్ టీమ్స్ సెమీ ఫైనల్ చేరుకోవడం తెలిసిందే. శనివారం వరకు సెమీఫైనల్ కి సంబంధించి ఈ ఇరుజట్లకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సునాయాసంగా భారత్ సెమీఫైనల్ కి చేరుకుంది. ఇదే సమయంలో ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ గెలవడంతో…పాక్ కూడా సెమిస్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :7 November 2022,10:20 am

India Vs Pakistan : T20 వరల్డ్ కప్ వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ 2 నుండి భారత్, పాకిస్తాన్ టీమ్స్ సెమీ ఫైనల్ చేరుకోవడం తెలిసిందే. శనివారం వరకు సెమీఫైనల్ కి సంబంధించి ఈ ఇరుజట్లకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సునాయాసంగా భారత్ సెమీఫైనల్ కి చేరుకుంది. ఇదే సమయంలో ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ గెలవడంతో…పాక్ కూడా సెమిస్ కి చేరుకోవడం జరిగింది.

ఈ ఇరు జట్లు సెమీస్ లో ఉండటంతో ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఫైనల్ మ్యాచ్ భారత్-పాక్ మధ్య జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2007వ సంవత్సరంలో మొట్టమొదటి టి20 ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరిగింది. ధోని నాయకత్వంలో టీం ఇండియా T20 ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఆ సమయంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 157 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.

India vs Pakistan in T20 World Cup Final

India vs Pakistan in T20 World Cup Final

పాకిస్తాన్ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది.ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు ఈ రెండు టీంలు ఫైనల్ కి రావాలని మ్యాచ్ జరగాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. సెమీఫైనల్ లో పాకిస్తాన్ … న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఇండియా… ఇంగ్లాండ్ తో సెమిస్ ఆడనుంది. మరి జరగబోయే ఈ సెమిస్ మ్యాచ్ లలో ఎవరు గెలుస్తారో చూడాలి.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది