India vs Pakistan : భారత్ టార్గెట్ 242.. మ్యాచ్‌లో సందడి చేసిన లోకేష్ ,చిరు , సుకుమార్..!
India vs Pakistan : భారత్- పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. దాంతో పాకిస్తాన్ Pakistan 241 పరుగులకి ఆలౌట్ అయింది. భారత బౌలర్స్‌లో కుల్దీప్ యాదవ్ 3, హార్ధిక్ పాండ్యా 2,హర్షిత్ రానా, జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ గెలుపుకి 50 ఓవర్లలో 252 పరుగులు చేయాల్సి ఉంది.

India vs Pakistan : భారత్ టార్గెట్ 242.. మ్యాచ్‌లో సందడి చేసిన లోకేష్ ,చిరు , సుకుమార్..!
India vs Pakistan సెలబ్రిటీల సందడి..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ భారత్‌పై ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ లో షమీ, హర్షిత్ రాణాలు త్వరగా వికెట్లు తీసుకోలేకపోయారు. అయితే, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు టీమిండియాకు బ్రేక్ త్రూ అందించారు. హర్దిక్ పాండ్యా Hardik Pandya తొలి వికెట్ రూపంలో బాబార్ ఆజంను పెవిలియన్ కు పంపాడు
పాక్ బ్యాట్స్‌మెన్స్‌లో సౌద్ షకీల్(65) ,మహ్మద్ రిజ్వాన్ (46)మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్ల్ ఖుష్‌దిల్ మెరుపులు మెరిపించారు. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు నారా లోకేష్,మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi , దర్శకుడు సుకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.భారత్ వికెట్ తీసినప్పుడల్లా వారు ఫుల్ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.