India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన భారత్.. అదరగొట్టిన సిరాజ్
ప్రధానాంశాలు:
India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన భారత్.. అదరగొట్టిన సిరాజ్
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం ఆరు పరుగుల విజయం సాధించింది. తద్వారా అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ నాలుగు వికెట్స్ తీసాడు.

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన భారత్.. అదరగొట్టిన సిరాజ్
India Vs England : అద్భుత విజయం..
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (105), హ్యారీ బ్రూక్ (111) లు శతకాలతో సాధించారు. ఆఖరి రోజు చేతిలో నాలుగు వికెట్లు ఉండగా.. 35 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు సిరాజ్ షాక్ ఇచ్చాడు. ప్రసిద్ద్ కృష్ణ తొలి ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చినా.. సిరాజ్ తన వరుస ఓవర్లలో ఓవర్ నైట్ బ్యాటర్లు జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9)లను ఔట్ చేశాడు. మరికాసేపటికే జోష్ టంగ్ (0)ను ప్రసిద్ద్ కృష్ణ ఔట్ చేశాడు.
అయితే.. తీవ్రంగా గాయపడి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాని క్రిస్ వోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బరిలోకి దిగాడు. విజయానికి మరో 17 పరుగులు అవసరం అయిన తరుణంలో ఒంటి చేత్తో బ్యాటింగ్ కి రాగా, మరో ఎండ్‌లో ఉన్న అట్కిస్కన్ (17) మాత్రం వోక్స్ కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకుండా జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించాడు. అయితే.. సిరాజ్ ఓ అద్భుత బంతితో అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా విజయం సాధించింది. స్టేడియం అంతా జయహో టీమిండియా నినాదాలతో మారు మోగింది.