INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు
ప్రధానాంశాలు:
INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, గాయాలను కూడా లెక్క చేయకుండా తమ జట్టు విజయానికి ప్రాధాన్యత ఇస్తూ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. నిజమైన క్రీడాస్ఫూర్తిని చాటుతూ అసలైన వారియర్స్‌లా ముందుకు సాగారు. ప్రస్తుతం వీరి త్యాగం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. అభిమానులు, సహక్రీడాకారులు మాత్రమే కాదు, ప్రముఖ క్రీడా విశ్లేషకులు కూడా ఈ ఇద్దరి నిబద్ధతను అభినందిస్తున్నారు.

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు
INDVs ENG : గెట్ వెల్ సూన్..
రిషబ్ పంత్ కాలికి గాయమైన అలానే బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీ చేశాడు. జట్టు కష్టాలలో ఉన్నప్పుడు తనవంతు సపోర్ట్ అందించాలని భావించిన పంత్ సింగిల్ లెగ్‌తోనే కొంత సేపు బ్యాటింగ్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో జోష్ టంగ్ అవుట్ అయిన తర్వాత, చివరి వికెట్‌గా వోక్స్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. భారత బౌలర్లు చివరి వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, వోక్స్ ఒక చేతితో బ్యాటింగ్ చేయడానికి రావడం చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు.
1963 తర్వాత గాయంతో సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మొదటి ఆటగాడు వోక్స్.అయితే వీరిద్దరు త్వరగా కోలుకొని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాలని క్రీడాభిమానులందరూ ఆకాంక్షిస్తున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం కోసం తీవ్రంగా పోరాడి గెలిచింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.