IPL 2022 Auction : డేవిడ్ వార్నర్ అంత పనికి రాకుండా పోయాడా.. సన్‌రైజర్స్ నిర్వాహకులని బండబూతులు తిడుతున్న నెటిజన్స్
IPL 2022 Auction : ప్రపంచంలోని స్టైలిష్ బ్యాట్స్‌మెన్స్‌లో డేవిడ్ వార్నర్ ఒకరు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఆయనకు ఉంది. ఇన్నాళ్లు సన్‌రైజర్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఢిల్లీ చేతికి చిక్కాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో దారుణంగా విఫలమైంది. మార్కీ ప్లేయర్స్ లిస్ట్‌లో ఒక్కరిపై కూడా ఆసక్తి చూపించలేదు. కానీ నికోలస్ పూరన్ కోసం రూ.10.75 కోట్లు, అభిసేక్ శర్మ కోసం ఏకంగా రూ.6.50 కోట్లు, రాహుల్ త్రిపాఠి కోసం రూ.8.50 కోట్లు అనవసరంగా ఖర్చు చేసింది. రూ. 8 కోట్ల లోపే అమ్ముడుపోయిన జానీ బెయిర్ స్టోను కాదని పూరన్‌కు సుమారు రూ.11 కోట్లు ఖర్చు చేయడం ఎందుకునేది ఎవరికి అర్ధం కాలేదు.
ఇండియన్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను 12.25 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు, పేసర్ కగిసో రబడ 9.25 కోట్లకు కూడా మంచి ధరకే అమ్ముడుపోయారు. అయితే ఎన్నో అంచనాలు మధ్య వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయాడు. ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొనగా.. చివరికి ఢిల్లీ దక్కించుకుంది.
IPL 2022 Auction david warner sold for delhi capitals
IPL 2022 Auction : దారుణమైన పరిస్థితి..
అనామక ప్లేయర్ అభిషేక్ శర్మ కోసం హైదరాబాద్ రూ.6.50 కోట్లు చెల్లించడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులతో పాటు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించిన వార్నర్ కన్నా అభిషేక్ శర్మ గొప్పోడా? అని ప్రశ్నిస్తున్నారు. చెప్పలేని విధంగా నిర్వాహకులని బండబూతులు తిడుతున్నరు. ఫన్నీ మీమ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక డేవిడ్ వార్నర్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రూ.12.50 కోట్ల వేతనాన్ని అందుకున్నాడు. ఐపీఎల్ 2018 వేలంలో అతన్ని సన్‌రైజర్స్ ఈ భారీ ధరకు రిటైన్ చేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వార్నర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎగబడతాయని అంతా భావించారు. కనీసం రూ. 10 నుంచి 15 కోట్లు పలుకుతాడని అంచనా వేసారు. కానీ అతను సగం ధరకే ఢిల్లీకి సొంతమయ్యాడు