IPL 2022 Auction : ఐపీఎల్‌లో కాసుల వేలం.. ఈ క్రికెటర్స్‌కి పంట పండిందిగా.. అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే..!!
IPL 2022 Auction : ఎప్పుడా ఎన్నడా అంటూ అభిమానులు అందరు ఎదురు చూసిన ఐపీఎల్ మెగా వేలం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు కొందరు వేలంలోకి రాగా, రేపు మరి కొందరిని తీసుకోనున్నారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ముందుగా వేలంలోకి వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్‌ను కొనుగోలు చేసింది.టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకి వేలంలో జాక్‌పాట్ కొట్టేశాడు. వేలంలో అతడిని రాజస్తాన్ రాయల్స్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ కోసం కేకేఆర్, రాజస్తాన్ పోటీ పడ్డాయి. చివరకి రాజస్తాన్ ప్రసిద్ధ్ కృష్ణను కైవసం చేసుకుంది.
IPL 2022 Auction ప్రసిద్ధ్ కృష్ణకి వేలంలో జాక్‌పాట్..
కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. SRH పూరన్ కోసం బిడ్డింగ్‌ను ప్రారంభించింది. దానిని 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. KKR – CSK వెనుకబడిపోయింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. రూ. 10.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. మిండియా సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేయగా.. ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది.
టీమిండియా యువ బౌలర్ హర్షల్ పటేల్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్‌ను ఆర్‌సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆర్‌సీబీ తరపున 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌పై నమ్మకముంచిన ఆర్‌సీబీ మరోసారి కొనుగోలు చేసింది.
టాప్- 10: ఎవరెవరు ఎంతకు అమ్ముడుపోయారంటే!
1.శిఖర్ ధావన్: రూ. 8.25 కోట్లు- పంజాబ్ కింగ్స్
2.రవిచంద్రన్ అశ్విన్: 5 కోట్లు- రాజస్తాన్ రాయల్స్
3.ప్యాట్ కమిన్స్: 7.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్
4.కగిసో రబడ: 9.25 కోట్లు- పంజాబ్ కింగ్స్
5.ట్రెంట్ బౌల్ట్: 8 కోట్లు- రాజస్తాన్ రాయల్స్
6. శ్రేయస్ అయ్యర్: 12.25 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్
7. మహ్మద్ షమీ- 6.25 కోట్లు- గుజరాత్ టైటాన్స్
8. ఫాఫ్ డుప్లెసిస్- 7 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)
9. క్వింటన్ డికాక్- 6.75 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
10. డేవిడ్ వార్నర్- 6.25 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్