Ishan Kishan : ట్రిపుల్ సెంచరీ చేయకుండా చేశాడు.. విరాట్ కోహ్లీపై ఇషాన్ కిషన్ సంచలన కామెంట్స్..!
Ishan Kishan : బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.. కెరీర్‌లో సాధించిన తొలి సెంచరీనే డబుల్‌గా మలిచిన ఇషాన్ కిషన్.. పలు రికార్డులను కూడా అధిగమించాడు. ముస్తాఫిజుర్ అహ్మద్ వేసిన 35వ ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ 126 బంతుల్లోనే ఈ ద్విశతకాన్ని సాధించి ఔరా అనిపించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రలకెక్కాడు.
అయితే విరాట్ కోహ్లీ సహకారంతోనే ఈ ద్విశతకం సాధ్యమైందని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. సునామి ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ఇషాన్.. సెంచరీ మార్క్ ముందు ప్రశాంతంగా ఆడాలని కోహ్లీ పదే పదే చెప్పాడని గుర్తు చేసాను. కోహ్లీ సూచనలతో సెంచరీ మార్క్ అందుకున్న తాను ద్విశతకం కూడా సాధించాను అని అన్నాడు. అంతేకాదు మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడటం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. బంతిని స్పష్టంగా చూడాలని, ఒత్తిడికి గురవ్వకుండా స్వేచ్చగా ఆడాలని సూర్యకుమార్ తనకు సూచించాడని, ఆ క్రమంలో డబుల్ సెంచరీతో దిగ్గజాల సరసన చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.
Ishan Kishan : అదరగొట్టేసే వాడిని..!
ఇషాన్ కిషన్ 90ల్లో ఉన్నప్పుడు సిక్స్ కొట్టి సెంచరీ చేయాలని అనుకున్నాడట. కానీ, విరాట్ కోహ్లీ సూచనలతో సింగిల్స్ తీసాడట. ఇది నీ మొదటి సెంచరీ. సింగిల్స్ తీయి అని చెప్పడంతో అలా చేసానని ఇషాన్ తెలిపాడు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన ఇషాన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ కూడా సెంచరీ చేయగా, వన్డేలలో కోహ్లీకి ఇది 44వ శతకం. మొత్తంగా 72వది. తద్వారా కోహ్లీ సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటిగ్ ను అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు ఇషాన్.