Ishan Kishan : టీ20 ప్రపంచ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ చేసిన మ్యాజిక్ ఫాలో అయ్యా… అందుకే డబుల్ సెంచరీ సాధించానన్న ఇషాన్ కిషన్
Ishan Kishan : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో తుది జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. చిన్న వయస్సులోనే డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకొని వరల్డ్ రికార్డు సృష్టించిన ఇషాన్ కిషాన్ మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్‌తో కలిసి చిట్ చాట్ చేయగా, ఇందులో కిషన్ తన ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను అప్పుడు 197 పరుగుల వద్ద ఉన్నానుకుంటా. ముస్తాఫిజురు నాకు తక్కువ వేగంతో బంతులు వేస్తున్న నేపథ్యంలో సిక్స్ కొట్టాలని అనుకున్నాను.
కాని ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనే బరిలోకి దిగే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని భావించి మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ వద్దకు వెళ్లి.. సింగిల్స్ మాత్రమే తీయాలని నాకు గుర్తు చేస్తుండాలని.. లేకపోతే నేను పెద్ద షాట్‌కు వెళతానని చెప్పానంటూ ఇషాన్ అన్నాడు. కోహ్లీ కూడా సింగిల్స్‌తోనే 200 పూర్తి చేయాలని గుర్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘనత సాధించాను’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ కు ముందు సూర్య కుమార్ యాదవ్ తో చాటింగ్ చేశానని, బంతిని బాగా గమనించి ఆడాలని అతడు చెప్పాడని తెలిపాడు. అవకాశాన్ని వినియోగించుకోవాలనే తాను అనుకున్నానని, ఒత్తిడికి ఏమ ఆత్రం గురి కావద్దని భావించానని చెప్పాడు.
Ishan Kishan : అతడిని ఫాలో అయ్యా…!
సూర్య భాయ్ టీ 20 ప్రపంచకప్ సమయంలో మ్యాచ్ రోజున నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం చూశాను. అతను ఆ మ్యాచ్‌లో బాగా రాణించాడు. అతడిని ఫాలో అవుతూ బంగ్లాతో మ్యాచ్‌లో ద్విశతకం చేశానంటూ ఇషాన్ అన్నాడు. కాగా, ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసి టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో లిట్టన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ‘‘మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔట్ అయ్యాను. లేకుంటే 300 పరుగులు చేసేవాడిని’’ అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇషాన్. అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకాలు చేయగా, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో ద్విశతకం చొప్పున చేసిన విషయం తెలిసిందే.