Ishan Kishan : ఇషాన్ కిషన్.. సన్‌రైజర్స్ కు విజయం అందిస్తాడా..?
Ishan Kishan : సన్‌రైజర్స్ హైదరాబాద్ 2022, 2023 ఐపీఎల్ IPL సీజన్లలో నిరాశపరిచినప్పటికీ, 2024 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్‌గా నిలిచింది. Pat Cummins ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీతో చక్కటి విజయాలు సాధించగా, ట్రావిస్ హెడ్, Travis Head, Abhishek Sharma, అభిషేక్ శర్మ, క్లాసెన్, Klassen , నితీశ్ కుమార్ రెడ్డిలు Nitish Kumar బ్యాటింగ్‌లో తుఫాను సృష్టించారు. అయితే మెగా వేలం నేపథ్యంలో కేవలం ఐదుగురినే రీటెయిన్ చేసుకునే అవకాశం ఉండటంతో, వారిని మాత్రమే కొనసాగించి మిగిలిన ఆటగాళ్లను వేలానికి వదిలారు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మార్క్రమ్, ఆదిల్ రషీద్, అబ్దుల్ సమద్‌లను వదిలి, మెగా వేలంలో టీమిండియా పేసర్ షమీ, స్పిన్నర్లు జంపా, రాహుల్ చహర్, హర్షల్ పటేల్‌లను దక్కించుకున్నారు.
ఈసారి వేలంలో సన్‌రైజర్స్ అత్యంత ప్రాముఖ్యతనిచ్చిన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ఒకడు. అతడిని రూ. 11.25 కోట్లకు సొంతం చేసుకుని జట్టును మరింత బలంగా మార్చుకుంది. 2023 ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన ఇషాన్, వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించినా, తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఆపై మెంటల్ హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆటకు తాత్కాలిక విరామం తీసుకున్నాడు. అయితే తిరిగి రంజీ ట్రోఫీలో ఆడమన్న బీసీసీఐ సూచనను పాటించకపోవడంతో, అతడు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025లో మెరుగైన ప్రదర్శన చూపించి, మరోసారి టీమిండియా తలుపులు తెరవాలని పట్టుదలతో ఉన్నాడు.

Ishan Kishan : ఇషాన్ కిషన్.. సన్‌రైజర్స్ కు విజయం అందిస్తాడా..?
Ishan Kishan L ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే
ఇషాన్ కిషన్ Ishan Kishan ఒకసారి ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే, ట్రావిస్ హెడ్, Travis Head, Abhishek Sharma అభిషేక్ శర్మ వంటి హార్డ్-హిట్టర్లతో కలిసి బౌలర్లను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, వికెట్ కీపర్‌గా కూడా అతడి అనుభవం జట్టుకు చాలా అవసరం. ఇషాన్ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తే, ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ చాంపియన్‌గా నిలిచే అవకాశాలు మెరుగవుతాయి. ఇక ఇది అతడి కెరీర్‌లో మళ్లీ జాతీయ జట్టుకు ఎంపిక అయ్యే మార్గాన్ని సుగమం చేయనుంది.