Ishan Kishan : అబ్బా ఏం క్యాచ్ పట్టావ్‌రా.. ధోనీని గుర్తు చేసిని ఇషాన్ కిషన్.. వీడియో
Ishan Kishan : కొత్త సంవత్సరంలో భారత్‌కి శుభారంభం దక్కింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.కుర్రాళ్లతో కూడిన జట్టు సమిష్టిగా రాణించడంతో విజయం దక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో దీపక్ హుడా, అక్షర్ పటేల్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులేమీ చేయలేకపోయారు.. అయితే బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం, వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో భారత జట్టు విజయం సాధింగలిగింది. అయితే 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను చివరకు 160 పరుగులకు భారత్ ఆలౌట్ చేసిందంటే అందుకు కారణం బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ అని చెప్పాలి.
చిరుతలా.. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి అందించాడు. అతడు ఈ ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చి రెండు రనౌట్లు చేయడంతో భారత్ స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో యంగ్ సెన్సేషన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చిరుతపులిలా కదులుతూ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్ గా మారింది.. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 8 ఓవర్‌లో ఉమ్రాన్ వేసిన బంతిని చరిత్ అసలంక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, అది ఎడ్జ్ తీసుకోవడంతో బంతి గాలిలో ఫైన్ లెగ్ వైపు వెళ్లింది అయితే
ఆ క్యాచ్‌ని అందుకునేందుకు హర్షల్ పటేల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే అంతకుముందే కీపర్ ఇషాన్ కిషన్ చిరుతలా పరిగెత్తి, హర్షల్‌ను ఆగిపోమ్మని సైగ చేశాడు. గాలిలోకి డైవ్ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకుకోవడంతో అసలంక 12 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇదిలా ఉంటే కిషన్ క్యాచ్ చిరుతలా పట్టిన క్యాచ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఇషాన్ ఫీట్‌ను చూసి కెప్టెన్ హార్దిక్ తో పాటు తోటి ఆటగాళ్లు కూడా నమ్మలేకపోయాడు. ఇటీవలి కాలంలో వికెట్ కీపర్ పట్టిన అత్యుత్తమ క్యాచ్ ఇదని పలువురు కామెంట్ చేయడంతో పాటు ధోనిని గుర్తుచేశావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
What a cath #ishankishan ❤️#INDvsSL pic.twitter.com/aX80FBxU43
— Rahul Sisodia (@Sisodia19Rahul) January 3, 2023