IPL : మరీ ఇంత మోసమా… మొత్తుకుంటున్న ఆ జట్టు ఓనర్
ప్రధానాంశాలు:
IPL : మరీ ఇంత మోసమా... మొత్తుకుంటున్న ఆ జట్టు ఓనర్
IPL : దేశానికి అద్భుతంగా ఆడుతూ ఐపీఎల్‌కి వచ్చే సరికి చెత్త ఫామ్ కొనసాగిస్తున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఈ సారి వేలంలో పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌ను రూ.4 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2025లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మ్యాక్స్‌వెల్ కు 6 మ్యాచ్‌లలో 5 సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది.

IPL : మరీ ఇంత మోసమా… మొత్తుకుంటున్న ఆ జట్టు ఓనర్
IPL చెత్త ప్రదర్శన..
ఈ 6 మ్యాచ్‌లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 8.2 సగటుతో కేవలం 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మ్యాక్స్‌వెల్ స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టగలిగాడు. ఈ మ్యాచ్ లలో మ్యాక్స్‌వెల్ చేసిన అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే. అంటే మిగిలిన 4 ఇన్నింగ్స్ లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాక్స్‌వెల్ తన బౌలింగ్ లో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
అతను ఔట్ అవుతున్న తీరు అందరిని నిరాశపరుస్తోంది. గత ఏడాది గ్లెన్ మ్యాక్స్‌వెల్ ను ఆర్సీబీ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు 10 మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ బ్యాట్ నుంచి కేవలం 52 పరుగులు మాత్రమే వచ్చాయి. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సగటు 5.78 అంటే గత సీజన్ నుంచి ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్‌లో అత్యధికంగా డకౌట్ అయిన ఆటగాడు కూటా అతనే కావడం గమనార్హం. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2012 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు మ్యాక్స్‌వెల్ లీగ్ నుంచి జీతంగా రూ.100 కోట్ల 64 లక్షలు సంపాదించాడు.