India vs Bangladesh : బంగ్లాదేశ్ చేతిలో సీరీస్ కొలోపోయిన ఇండియన్ టీం మీద 15 భయంకరమైన ట్రాల్స్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India vs Bangladesh : బంగ్లాదేశ్ చేతిలో సీరీస్ కొలోపోయిన ఇండియన్ టీం మీద 15 భయంకరమైన ట్రాల్స్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :8 December 2022,5:00 pm

India vs Bangladesh : అసలు బంగ్లాదేశ్ చేతుల్లో టీమిండియా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ.. అదే జరిగింది. అసలు బంగ్లాదేశ్ గెలవడానికి కారణం బంగ్లాదేశ్ బ్యాటర్స్ మిరాజ్, మహ్మదుల్లా. ఇద్దరూ చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ గెలవగలిగింది. బంగ్లా బ్యాట్స్ మెన్లకు.. ఇండియన్ బౌలర్లు చుక్కలు చూపించినా కూడా టాస్ గెలిచిన బంగ్లా బ్యాటర్లు చెలరేగిపోయారు. టఫ్ బౌలింగ్ తో ముందు 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ టఫ్ బౌలింగ్ వేశాడు. ఆరు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం భయపడకుండా..

మిరాజ్, మహ్మదుల్లా ఇద్దరూ కలిసి 148 పరుగులు చేశారు.దీంతో ఎనిమిది వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పరిమిత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. మహ్మదుల్లా 77 పరుగులతో సరిపెట్టుకోగా, మిరాజ్ సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి చెలరేగిపోయి రికార్డు క్రియేట్ చేశారు. అసలు.. ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ వంద పరుగులు కూడా చేయలేదు కానీ.. 271 పరుగులు చేసింది. రికార్డు క్రియేట్ చేసింది. బంగ్లాదేశ్ 271 పరుగులు చేయడంతో భారత్ కు ఏం చేయాలో అర్థం కాదు.

memes trending on India on losing match against bangladesh

memes trending on India on losing match against bangladesh

India vs Bangladesh : చేతికి గాయం అయినా బ్యాటింగ్ చేసి 51 పరుగులు చేసిన రోహిత్ శర్మ

ఎలాగైనా మ్యాచ్ గెలవాలని.. పసికూనపై మ్యాచ్ ఓడిపోతే బాగుండదని భారత బ్యాట్స్ మెన్లు తెగ ట్రై చేశారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా బరిలోకి దిగాడు. 51 పరుగులు చేసినప్పటికీ తన కష్టం వృథా అయింది. చివరకు ఆ మ్యాచ్ ను వదులుకోవాల్సింది. ఏది ఏమైనా.. మ్యాచ్ ఓడిపోయినా.. రోహిత్ శర్మ మాత్రం ఇండియన్స్ మనసును గెలుచుకున్నాడు. దీంతో దానికి సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది