India vs Australia Final 2023 : కచ్చితంగా భారత్ గెలుస్తుంది .. నా కొడుకు గెలిపిస్తాడు ‘ – మహమ్మద్ షమీ తల్లి ..!
India vs Australia Final 2023 : వన్డే వరల్డ్ కప్ లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈరోజు అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో మొదలు కానుంది. ఈ తుది పోరుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అభిమానులు అహ్మదాబాద్ కు భారీ ఎత్తున పోటెత్తారు. టాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా అక్కడికి […]
ప్రధానాంశాలు:
India vs Australia Final 2023 : కచ్చితంగా భారత్ గెలుస్తుంది ..
నా కొడుకు గెలిపిస్తాడు ' - మహమ్మద్ షమీ తల్లి ..!
India vs Australia Final 2023
India vs Australia Final 2023 : వన్డే వరల్డ్ కప్ లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈరోజు అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో మొదలు కానుంది. ఈ తుది పోరుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అభిమానులు అహ్మదాబాద్ కు భారీ ఎత్తున పోటెత్తారు. టాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా అక్కడికి చేరుకున్నారు. సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ను ఓడించిన భారత్ ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది. కప్ కోసం రెండు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ ,శ్రేయస్ అయ్యర్, జన ప్రీత్ బూమ్రా పై అందరి కళ్ళు నిలిచాయి. ఈ మ్యాచ్ గెలవాలని భారత అభిమానుల్లో ఉత్కంఠత పెరిగింది. అటు ఆస్ట్రేలియా కూడా భారత్ పై గెలవడానికి నెట్లో చెమటోడుస్తుంది. వరల్డ్ కప్ ఫైనల్ పై ఉత్కంఠ పెరిగిన క్రమంలో మహమ్మద్ షమీ తల్లి అంజుమ్ అరా మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహలో ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
తన కొడుకు మహమ్మద్ షమీ దేశం గర్వించేలా ఆడుతున్నాడని ఆమె తెలిపారు. తన కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందని, మరోసారి ఫైనల్స్ లో జట్టును గెలిపిస్తాడని ఆమె అన్నారు. దేశ ప్రజలందరి దీవెనలు జట్టు వెంటే ఉంటాయని, ఈ ఫైనల్లో భారత్ కచ్చితంగా గెలుస్తుందని తనకు అనిపిస్తున్నట్లు ఆమె చెప్పారు. తనకు క్రికెట్ పెద్దగా ఆసక్తి లేదని, కానీ చిన్నప్పటినుంచి షమీని క్రికెట్ లోకి వెళ్లేలా చేశానని ఆమె అన్నారు. ఇక మహమ్మద్ దోషాన్ని వరల్డ్ కప్ లో విజృంభించి ఆడుతున్నారు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో 23 వికెట్లు తీశారు. ఇక న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో ఏకంగా ఏడు వికెట్లు తీసి రికార్డ్స్ బ్రేక్ చేశారు.