Virat Kohli : విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో తెరపైకి వచ్చిన కొత్త పేర్లు..!
Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్ సారథ్య బాధ్యతల వైదొలుగుతున్నట్లు కోహ్లి శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దాంతో భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా కోహ్లి శకం ముగిసినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్ 16న యూఏఈలో ప్రపంచకప్ ముగిశాక టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కోహ్లి నవంబర్‌లో ఈ మెగా ఈవెంట్ ముగిశాక తన మాట నిలబెట్టుకున్నాడు.కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా తప్పుకోవడంతో ఆయన బాధత్యలు ఎవరు అందుకుంటారనే ప్రచారం జోరుగా నడుస్తుంది.
ఇందులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో భారత జట్టు తర్వాతి టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడైనా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉండాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. రిషబ్ పంత్‌కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ మరింత రాణించగలుగుతాడని ఆయన అభిప్రాయపడ్డారు.24 ఏళ్ల రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ముందు కెప్టెన్సీ లోపంతో సరిగ్గా రాణించలేకపోయిన ఢిల్లీ జట్టు ప్రస్తుతం రిషబ్ పంత్ కెప్టెన్సీలో సత్తా చాటుతుంది.
Virat Kohli : తదుపరి కెప్టెన్ ఎవరంటే..!
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ శతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్‌లో 28 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 39 సగటుతో 1735 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే టి20 కెప్టెన్సీకి రాజీనామా చేయవద్దని చెప్పినా తమ మాట వినని కోహ్లికి షాక్ ఇచ్చింది. వన్డే ఫార్మాట్‌లో కోహ్లిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ రోహిత్ శర్మను కొత్త కెప్టెన్‌గా నియమించింది.