Pat Cummins : కొంప ముంచిన అతి విశ్వాసం.. కమిన్స్ ఏంటీ తప్పుడు నిర్ణయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pat Cummins : కొంప ముంచిన అతి విశ్వాసం.. కమిన్స్ ఏంటీ తప్పుడు నిర్ణయం..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Pat Cummins : కొంప ముంచిన అతి విశ్వాసం.. కమిన్స్ ఏంటీ తప్పుడు నిర్ణయం..!

Pat Cummins : ఎస్ ఆర్ హెచ్ వరుస విజయాలతో జోరు మీద ఉంది.. ఇక టైటిల్ గెలుస్తుందేమో అనుకున్న సమయంలో నిన్న రాత్రి కేకేఆర్ తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. అసలు ఏ విభాగంలో కూడా ఆకట్టుకోలేకపోయింది. అటు బ్యాటింగ్ లో ఇటు, ఫీల్డింగ్ లో చివరకు బౌలింగ్ లో కూడా అట్టర్ ప్లాప్ అయిపోయింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి 55; 35 బంతుల్లో, 7×4, 1×6 ఒక్కడే బాగా ఆడాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3×4, 1×6), ప్యాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో, 2×4, 2×6) ఆదుకున్నారు.

Pat Cummins వారిద్దరి వల్లనే..

వీరి తర్వాత అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2×6 పర్వాలేదనిపించాడు. అంతే మిగతా వారెవరూ కూడా రెండంకెల స్కోర్ ను అందుకోలేకపోయారు. కోల్ కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) సత్తాచాటారు. అయితే కేకేఆర్ ఛేదనకు దిగి దుమ్ము లేపింది. కేవలం 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి టార్గెట ను ఊదేసింది. శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5×4, 4×6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5×4, 4×6) అర్థశతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. సన్ రైజర్స్ బోలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

Pat Cummins కొంప ముంచిన అతి విశ్వాసం కమిన్స్ ఏంటీ తప్పుడు నిర్ణయం

Pat Cummins : కొంప ముంచిన అతి విశ్వాసం.. కమిన్స్ ఏంటీ తప్పుడు నిర్ణయం..!

కమిన్స్ (1/38), నటరాజన్ (1/22) చెరో వికెట్ మాత్రమే సాధించారు. అంతే కాకుండా బౌలింగ్ సమయంలో కీలకమైన క్యాచ్ లను చాలానే వదిలేశారు. అవి మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాయి. దాంతో సన్ రైజర్స్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కమిన్స్ తీసుకున్న నిర్ణయమే అందరికీ నచ్చట్లేదు. అహ్మదాబాద్ పిచ్ ఎప్పుడైనా సరే ఆట కొనసాగేకొద్దీ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా టాస్ గెలిచిన తర్వాత కమిన్స్ ఎందుకు బ్యాటింగ్ ఎంచుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. పైగా మ్యాచ్ కు ముందు కమిన్స్ ఓ మాట అన్నాడు. తనకు పిచ్ అంచనా బాగా తెలుసని చెప్పి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే కమిన్స్ అతివిశ్వాసమే కొంప ముంచిందని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది