Big Breaking : న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ చేరుకున్న పాకిస్తాన్..!!
Big Breaking : ఈరోజుT20 ప్రపంచ కప్ టోర్నీలో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఉత్కంఠ బరితంగా రెండు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుపొందింది. దీంతో పాకిస్తాన్ ఫైనల్ కి చేరుకున్నట్లు అయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో..
నాలుగు వికెట్లు నష్టానికి 152 పరుగులు చేయడం జరిగింది. పాకిస్తాన్ బౌలర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. కివీస్ బ్యాట్స్ మెన్ లు చేతులెత్తేశారు. కెప్టెన్ విలియమ్స్ 42 బంతుల్లో 46 రన్స్ చేయగా.. మిచెల్ 35 బంతుల్లో 53 రన్స్ చేయడం జరిగింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. మ్యాచ్ లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 153 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.
కెప్టెన్ బాబర్ అజమ్ 42 బంతుల్లో 53 రన్స్ చేశాడు. రిజ్వాన్ 43 బంతుల్లో 57 రన్స్.. చేసి ఇద్దరు ఆక్సించరీలతో పాకిస్తాన్ ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. మరోపక్క రేపు ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ రెండు జట్లలో గెలిచిన టీం… పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. 2007వ సంవత్సరంలో మొదటి T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఇండియా గెలిచింది. అయితే రేపు జరగబోయే మ్యాచ్ లో ఇండియా గెలిస్తే… మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరి రేపు ఏ టీం గెలుస్తుందో చూడాలి.