Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి రవిశాస్త్రి అన్న మాటలలో ఇంత అర్ధం ఉందా?
Virat Kohli : వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్ ఎంత ఉత్కంఠతతో సాగిన విషయం మనం చూశాం. చివరి బాల్ వరకు నువ్వా నేనా అన్నట్టు గేమ్ సాగింది. కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచం మెచ్చిన పాక్ పేసర్లను పరేషాన్ చేస్తూ.. మెల్‌బోర్న్‌లో తిరుగులేని మొనగాడిగా విరాట్ అద్భుత విజయాన్నందించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. హార్దిక్ ఔటైనా.. కడవరకు క్రీజులో నిల్చొని విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా..
10 ఓవర్లకు 45 పరుగులే చేసినా.. చివరి 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉన్నా… ఏ మాత్రం జంకలేదు. 19వ ఓవర్‌లో మ్యాచ్ చేజారుతున్న సమయంలో విరాట్ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దాంతో భారత్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమవ్వగా.. పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. తొలి బంతికి హార్దిక్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. రెండో బంతికి సింగిల్ తీయడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.ఇక కోహ్లీని చూసి భయపడ్డ మహమ్మద్ నవాజ్ ఫుల్‌టాస్ వేయగా.. దాన్ని విరాట్ సిక్సర్‌గా మలిచాడు. అదికాస్త నోబాల్ కావడం..

ravi shastri praise on Virat Kohli
Virat Kohli : దటీజ్ కోహ్లీ..!
ఆ తర్వాత మరింత ఒత్తిడికి గురైన నవాజ్ వైడ్లు వేయడం.. ఫ్రీహిట్ బాల్ అనే సోయి లేకుండా ఉండిపోవడం చక చక జరిగిపోయాయి. పాక్ ని ఒత్తిడిలోకి నెట్టడం వల్లనే అలా జరిగింది అనేది చాల మంది మాట. అయితే విరాట్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించిన రవిశాస్త్రి.. కమెత్ ది అవర్.. కమెత్ ది స్టేజ్.. కమెత్ ది మ్యాన్.. అని అన్నాడు. దీని అర్ధం ఏంటా అని చూస్తే.. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, సమయం వీలుగా లేనప్పుడు.. ఓ వ్యక్తి వచ్చి పరిస్థితులు అన్ని తనవైపు మార్చి విజయం సాధించేవాడు అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు బాగున్నాయి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.