RCB Vs PBKS Final : మరి కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ మొదలు ఆర్సీబీకి పెద్ద దెబ్బ..!
RCB Vs PBKS Final : ఐపీఎల్ 2025 కి నేటితో తెర పడనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుండగా, ఈ మ్యాచ్‌తో కొత్త ఛాంపియన్ రానుంది.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే కాగా, ఈ సారి కొత్త ఛాంపియన్ రానుండడంతో అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.

RCB Vs PBKS Final : మరి కాసేపట్లో ఫైనల్ మ్యాచ్ మొదలు ఆర్సీబీకి పెద్ద దెబ్బ..!
RCB Vs PBKS Final బిగ్ ఎఫెక్ట్..
నేడు- రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంతా సవ్యంగా సాగుతుందనుకుంటోన్న ఈ దశలో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్స్ కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఉదయం నరేంద్ర మోదీ స్టేడియంలో నెట్ సెషన్స్ కు అతను అటెండ్ కాకపోవడం. అనుమానాలు పెంచింది.
ఫిల్ సాల్ట్ భార్య నిండు గర్భిణి కాగా, ఆమె నేడో, రేపో డెలివరీ కానున్నారు. తొలి చూలు బిడ్డకు స్వాగతం పలకనున్న నేపథ్యంలో భార్య పక్కన ఉండాలని ఫిల్ సాల్ట్ కోరుకుంటోన్నాడని, ఈ కారణంతో స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉన్నాడా? లేదా అనే విషయంపై ఆర్సీబీ మేనేజ్ మెంట్ ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాల్ట్ లేకుంటే ఇది ఆర్సీబీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.