Rishabh Pant : వికెట్ల వెనక మెరుపు వేగంతో కదులుతున్న పంత్.. వరల్డ్ కప్‌కి బెర్త్ కన్‌ఫాం అయినట్టేనా..?
Rishabh Pant : ప్రస్తుతం ఐపీఎల్ చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి కప్ ఎవరు దక్కించుకుంటారా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఐపీఎల్‌ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ కొందరు ఆటగాళ్లని సెలక్ట్ చేసే పనిలో పడింది. ఎవరు ఈ సారి జట్టులో చోటు దక్కించుకుంటారో ఆసక్తికరంగానే మారింది. అయితే ప్రస్తుతం టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన పంత్ ఇంతక ముందు మాదిరే ఆడుతున్నాయి. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పంత్ నైపుణ్యం చూసి అందరు అవాక్కయ్యారు.
Rishabh Pant : తన స్థానం కోసం కర్చీఫ్ వేసినట్టేనా
అతను మెరుపు స్టంపింగ్స్, చురుకైన వికెట్ కీపింగ్‌తో ఔరా అనిపించాడు. పంత్ యాక్టివ్‌నెస్ చూసి ఇతనికి యాక్సిడెంట్ అయిందా అని కొందరు నోరెళ్లపెడుతున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ సహకారంతోనే మూడు వికెట్స్ పడ్డాయి. కళ్లుచెదిరే క్యాచ్‌తో మిల్లర్‌ను, మెరుపు స్టంపింగ్‌తో అభినవ్ మనోహర్, షారుక్ ఖాన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు పంత్. ఇషాంత్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన మిల్లర్ షాట్‌కు ప్రయత్నిచండంతో అది ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. పంత్ వెంటనే తన ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్‌ని ఓడిసిపట్టాడు. ఆ తర్వాత స్టబ్స్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్‌లను తన మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు.
మొత్తంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో రెండు క్యాచులు, రెండు స్టంపింగ్‌లు బ్యాటింగ్‌లో 11 బంతుల్లో 16 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచాడు. తన నాయకత్వ లక్షణాలతోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లోకి రాకముందు పంత్ తిరిగి మునుపటి ఫామ్ అందుకుంటాడా, ఆ రేంజ్‌లో ఆడగలుగుతాడా అని అందరిలో డౌట్ ఉండేది. కాని ఇప్పుడు మునుపటి కన్నా ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సెలక్టర్లకు మెసేజ్ అయితే రిషబ్ పంపిస్తున్నాడు.మరి అతడిని ఈ సారి ఎంపిక చేస్తారా లేదా అనేది వేచి చూడాలి