Rohit Sharma : ఏంటి.. మళ్లీ రోహిత్ శర్మనే కెప్టెన్ కాబోతున్నాడా.. ముంబై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్..!
Rohit Sharma : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 2024 జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సీజన్‌లో చాలా మార్పులు జరిగాయి. కొత్త కెప్టెన్స్, కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ముఖ్యంగా భవిష్యత్ కోసమంటూ 5 కప్పులు అందించిన రోహిత్ శర్మని పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్ చేశారు. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అతడ్ని తొలగించడంతో ముంబై ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. రోహిత్ శర్మ లాంటి అనుభవం ఉన్న ప్లేయర్‌ని కాదని గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిపోయిన ప్లేయర్‌ను మళ్లీ తెచ్చుకొని అతనికి కెప్టెన్ అవకాశం ఇవ్వడమేంటని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్ని ఆందోళనలు జరిగిన కూడా చివరికి హార్ధిక్ కప్టెన్సీలోనే ముంబై తొలి మ్యాచ్ ఆడింది. గుజరాత్ టైటాన్స్‌తో తలపడిన మ్యాచ్‌లో నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గా టోటల్ ఫెయిల్ అయ్యాడు. సారథ్య బాధ్యతలు కోల్పోయిన రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్‌లో అదరగొట్టాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్‌ను కావాలనే హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పంపించడం అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. కెరీర్ మొదట్లో బౌండరీ లైన్ దగ్గర ఉన్న రోహిత్ మళ్లీ మొన్నటి మ్యాచ్‌లో కనిపించాడు. అయితే హార్ధిక్ తీరుపై అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం దీనిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రోహిత్, హార్ధిక్ ల మధ్య వివాదానికి తెర దించేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం సరికొత్త ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తుండగా, ఇందులో భాగంగానే రోహిత్ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అయితే ఇప్పటికప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం లేదు. హార్దిక్ పాండ్యాను వెంటనే తొలగిస్తే బయటకు వేరే సంకేతాలు వెళ్తాయని..అది జట్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ముంబై యాజమాన్యం ఆలోచిస్తుందట. అందుకే ఐపీఎల్ సీజన్ 17లో మొదటి షెడ్యుల్‌లో హార్దిక్ పాండ్యా జట్టును ముందుండి నడిపిస్తారని..రెండో భాగంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు తీసుకుంటారని ఒక టాక్ నడుస్తుంది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేస్తే రోహిత్ ఫ్యాన్స్ కూడా ఖుష్ అయ్యే ఛాన్స్ ఉంద.ఇక వివాదం కూడా సమసిపోతుందని అంటున్నారు.