BCCI : టెస్ట్ కెప్టెన్సీపై వచ్చిన క్లారిటీ.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పక్కనబెట్టిన బీసీసీఐ
BCCI : విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారా అనే ఆసక్తి అందరిలోఉంది. కొద్ది సేపటి క్రితం క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ శనివారం ప్రకటన చేసింది. ఇకపై పూర్తి స్ధాయిలో రోహిత్ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్‌లకు జట్టులను బీసీసీఐ ఎంపిక చేసింది. స్వదేశంలో శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
శ్రీలంకతో టెస్టులకు కెప్టెన్‌గా రోహిత్ ఎంపిక కాగా, వైస్ కెప్టెన్‌గా బూమ్రా నియమితుడయ్యాడు.ఇకపై రోహిత్ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ వ్యవహరించనున్నాడు. గత ఏడాది టీ20, వన్డేల్లో భారత కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ చెపట్టిన సంగతి తెలిసిందే. అయితే జనవరిలో టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సడన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోగా.. కెప్టెన్సీలో రేసులో రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు వినిపించాయి. కానీ.. రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించగా.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం శనివారం జట్టుని ఎంపిక చేసిన భారత సెలెక్టర్లు రోహిత్ శర్మని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
BCCI : అన్నింట్లోను రోహిత్ హంగామా…
ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. ఇకపై మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కొనసాగబోతున్నాడు. ఈ నెల 24న లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత ధర్మశాలలో 26, 27న వరుసగా రెండు, మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. అనంతరం మార్చి 4 నుంచి మొహాలిలో ఫస్ట్ టెస్టు, మార్చి 12 నుంచి బెంగళూరులో రెండో టెస్టు జరగనుంది. మొహాలి టెస్టు కోహ్లీకి కెరీర్‌లో 100వ టెస్టుకానుంది. టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకి, తొలి టెస్టు ఉదయం 9.30 గంటలకి, రెండో టెస్టు (డే/నైట్) మధ్యాహ్నం 12.30 గంటలకి ప్రారంభంకానుంది.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభమన్ గిల్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ (ఇంకా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేందర్ చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్