Rohit Sharma : మ్యాచ్ మ‌ధ్య‌లోనే గాయంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ‌.. సిరీస్ మొత్తానికి దూర‌మైన‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rohit Sharma : మ్యాచ్ మ‌ధ్య‌లోనే గాయంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ‌.. సిరీస్ మొత్తానికి దూర‌మైన‌ట్టేనా?

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2024,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Rohit Sharm : మ్యాచ్ మ‌ధ్య‌లోనే గాయంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ‌.. సిరీస్ మొత్తానికి దూర‌మైన‌ట్టేనా?

Rohit Sharma : ఇటీవ‌ల ఐపీఎల్ మ్యాచ్‌ల‌తో క్రికెట్ ప్రేమికుల‌కి మంచి వినోదం ద‌క్కింది. ఇక ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభ‌మైంది.ప్ర‌తి మ్యాచ్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.ఇక టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్ తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్, బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Rohit Sharma అభిమానుల్లో టెన్ష‌న్

భారత బౌలర్లు.. హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరగ‌డంతో ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్స్ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు.. అయితే ల‌క్ష్య చేధ‌న‌ను టీమిండియా 12.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాగా.. రిషభ్ పంత్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ(1), సూర్యకుమార్ యాదవ్(2) తీవ్రంగా నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెన్ వైట్ తలో వికెట్ తీసారు.

Rohit Sharma మ్యాచ్ మ‌ధ్య‌లోనే గాయంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ‌ సిరీస్ మొత్తానికి దూర‌మైన‌ట్టేనా

Rohit Sharma : మ్యాచ్ మ‌ధ్య‌లోనే గాయంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ‌.. సిరీస్ మొత్తానికి దూర‌మైన‌ట్టేనా?

అయితే ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ యాభై పరుగులు చేసిన తర్వాత.. రిటైర్డ్‌గా మైదానం వీడాడు.భారత్ 10 ఓవర్ల తర్వాత 76 పరుగులు చేసిన సమయంలో.. రోహిత్ భుజం నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అసౌకర్యంగా ఫీలవుతూ.. డగౌట్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.అయితే, సరైన కారణం ధృవీకరించనప్పటికీ, జోష్ లిటిల్ విసిరిన బౌన్సర్ రోహిత్ భుజంపై తగిలింది. దీంతో గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, మ్యాచ్ విజయం తర్వాత ప్రజంటేషన్ లో రోహిత్ కనిపించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గాయం చిన్నదా, పెద్దదా అనేది తెలియాల్సి ఉంది. గాయం పెద్దదైతే మాత్రం రోహిత్ ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది