Virat Kohli : వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇజ్జ‌త్ కాపాడిన విరాట్ కోహ్లీని ప‌క్క‌న పెట్టే ద‌మ్ముందా.. సీనియర్ క్రికెట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇజ్జ‌త్ కాపాడిన విరాట్ కోహ్లీని ప‌క్క‌న పెట్టే ద‌మ్ముందా.. సీనియర్ క్రికెట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2023,1:20 pm

Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత కొంద‌రు బ్యాట్స్‌మెన్స్ ని ప‌క్క‌న పెట్ట‌నున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులోనూ రోహిత్, విరాట్‌లకు చోటు దక్కకపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన విరాట్‌కి టీ20ల్లో చోటు దక్కకపోవడాన్ని మాజీ వికెట్ కీపర్ సబా కరీం.. తీవ్రంగా తప్పుబట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ లేకుంటే టీమిండియా ఓటమిపాలయ్యేదని ఆయ‌న అన్నాడు.

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే టీమిండియా ఓడిపోయేద‌న్న విషయం అంద‌రికి తెలుసు . అతను ఆడిన ఇన్నింగ్స్ అంత విలువైనది. అలాంటి ఇన్నింగ్స్‌ ఆడిన తర్వాత కూడా విరాట్ కోహ్లీని టీ20ల నుంచి తప్పిస్తారా? అంటూ ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక కానంత మాత్రాన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇక పొట్టి ఫార్మాట్ ఆడరని కాదు కాని కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్నట్టున్నారు. యంగ్ ప్లేయర్లు సరిగ్గా రాణించకపోతే మళ్లీ సీనియర్లు టీమ్‌లోకి రావాల్సిందే అని అన్నాడు.

saba Karim stunning comments on Virat Kohli

saba Karim stunning comments on Virat Kohli

Virat Kohli : అంత ధైర్యం ఉందా..!!

మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చిన తర్వాత కూడా మెయిన్ ప్లేయ‌ర్స్ ని టీమ్‌లో నుంచి తప్పించడం సరి కాదు.’అని సబా కరీం చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది టీ20ల్లో 138.23 స్ట్రైయిక్ రేటుతో 55.78 సగటుతో 781 పరుగులు చేశాడు స్టైలిస్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. 2022లో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్లలో ఆయ‌న మూడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 46.56 సగటుతో 1164 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 45.27 సగటుతో 996 పరుగులు చేశారు . కాగా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచిన విష‌యం తెలిసిందే.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది