Sachin Tendulkar : అర్జున్ టెండూల్కర్ పై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర కామెంట్స్..
Sachin Tendulkar : భారత క్రికెట్ క్రీడా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. అద్భుతమైన ఆట తీరును కనబర్చి భారత రత్న అవార్డు కూడా అందుకున్నారు. అయితే సచిన్ టెండూల్కర్ ఇటీవల తన కొడుకు అర్జున్ టెండూల్కర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆటను తాను ఇప్పటివరకూ చూడలేదని చెప్తున్నారు సచిన్. 22ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ చాలా దేశీవాలీ టోర్నమెంట్లు ఆడాడు. కాకపోతే అతని మ్యాచ్ ఒక్కటి కూడా చూడలేదట సచిన్. తల్లిదండ్రులు వారి పిల్లలు ఆడే ఆటను చూస్తే… వారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయన్న సచిన్.. ఆ మేరకు తాను తన కొడుకు అర్జున్ ఆడే మ్యాచ్‌లను చూడడానికి వెళ్లను అని చెప్పుకొచ్చారు. అర్జున్ తన ఆటను ఎప్పుడూ స్వేచ్ఛగా ఆడాలని తాను కోరుకుంతున్నట్లు చెప్పుకొచ్చారు. అతను ఏం కావాలనుకుంటున్నాడో దానిని సాధించడంపై దృష్టి పెట్టాలని తాను భావిస్తున్నట్లు వివరించారు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా నన్ను ఎవరైనా చూసిన తనకు నచ్చేది కాదన్నారు.
Sachin Tendulkar : అర్జున్ ఆటను చూడనే లేదు..!
తాను అర్జున్ ఆటను చూడటానికి వెళ్ళినా.. ఆ విషయం అర్జున్ కు తెలియకుండా ఎక్కడో ఓ చోట దాక్కుంటానని వివరించారు. నేను ఉన్నానని అతనికి కాదు కదా, కనీసం అతని కోచ్ కు కానీ మరెవరికీ కూడా తెలియనవ్వనని అన్నారు.ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను ఈ సారి మెగా వేలంలో కొనుగోలు చేసింది. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అర్జున్‌ను 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. కాగా 22 ఏళ్ల పేస్ ఆల్‌రౌండర్ అయినా అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు అనేక దేశవాళీ టోర్నమెంట్లు ఆడాడు. ఎడమ చేతి బౌలర్, బ్యాటర్‌గా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు.