Shoaib Malik : సానియా మీర్జాతో ఎట్టకేలకు విడాకులపై స్పందించిన షోయబ్ మాలిక్
Shoaib Malik: సానియా మీర్జా షోయబ్ మాలిక్ సెలబ్రిటీ స్టార్ కపుల్ అన్న సంగతి మనందరికి తెలిసిందే. వీరి ప్రేమ దేశాలు దాటి సరిహద్దులు దాటి గెలవడంతో, 2010లో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఓ మగబిడ్డ కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు వీరి వైవాహిక జీవితం ప్రమాదంలో పడింది అన్న వార్తలు సోషల్ మీడియాను ఎంతగా షేక్ చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. 12 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు ఈ స్టార్ కపుల్ సిద్దమయ్యారని, గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం జరిగింది.
మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేశాడన్న వార్తలు షికారు చేశాయి. ఆ మోడల్ తో కొన్ని నెలల క్రితం షోయబ్ ఫోటో షూట్ చేయగా, ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. . ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఓ టాక్ షో చేస్తుండడం అందరని ఆశ్చర్యపరచింది. పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇద్దరూ కలిసి ఓ టాక్ షో నిర్వహించబోతున్నట్టు ఆ సంస్థ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించగా, ఉర్దూఫ్లిక్స్ లో ‘మీర్జా మాలిక్’ షో ప్రసారం కాబోతోందంటూ ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది.
Shoaib Malik : క్లారిటీ వచ్చేసిందిగా..!
అయితే గత కొన్ని రోజులుగా విడాకుల అంశంపై చర్చనడుస్తూనే ఉండగా, ఇటీవల ఒక న్యూస్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, షోయబ్… సానియా మీర్జా నుండి విడాకుల గురించి కొనసాగుతున్న ఊహాగానాలపై స్పందించారు. ఇదే విషయమై షోయబ్ మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయంలో మీడియా నిరంతరం జోక్యాన్ని తప్పు పట్టాడు. “ఇది మా వ్యక్తిగత విషయం. ఈ ప్రశ్నకు నేను లేదా నా భార్య సమాధానం చెప్పలేదు. కదా వదిలేయండి అని అన్నాడు. షోయబ్ సమాధానంతో కొంత వరకు క్లారిటీ వచ్చిన ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియడం లేదు.