Shubman Gill : బాగుంది రా మామా.. తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌శంసించిన గిల్.. వీడియో వైర‌ల్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shubman Gill : బాగుంది రా మామా.. తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌శంసించిన గిల్.. వీడియో వైర‌ల్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2025,7:40 pm

ప్రధానాంశాలు:

  •  Shubman Gill : బాగుంది రా మామా.. తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌శంసించిన గిల్.. వీడియో వైర‌ల్‌..!

Shubman Gill :  india vs England లార్డ్స్ వేదికగా భారత్,  ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న Test Match మూడో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండ‌ర్ నితీష్ రెడ్డి nitish kumar reddy తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు గట్టి దెబ్బే వేశాడు. అయితే, ఇదే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ Shubman Gill ఒక క్యాచ్‌ను జారవిడిచి నితీష్ రెడ్డి ఖాతాలో మూడో వికెట్ వచ్చే అవకాశాన్ని దూరం చేశాడు.

Shubman Gill బాగుంది రా మామా తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌శంసించిన గిల్ వీడియో వైర‌ల్‌

Shubman Gill : బాగుంది రా మామా.. తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌శంసించిన గిల్.. వీడియో వైర‌ల్‌..!

Shubman Gill : బాగుంది రా మామా

బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ వంటి బౌలర్లు విజయం సాధించని లార్డ్స్ పిచ్‌పై, నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసం సృష్టించి, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. తన వేగంతో, స్వింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతూ రెండు ముఖ్యమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు వికెట్లు తీయడం ద్వారా నితీష్ రెడ్డి తన ఆల్ రౌండర్ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పాడు.

బౌలింగ్‌లో నిలకడగా రాణించలేకపోతున్నాడనే విమర్శలకు ఈ ప్రదర్శనతో కొంతమేర సమాధానం చెప్పాడు. అయితే నితీష్ అద్భుత బౌలింగ్‌తో గిల్ తెలుగులో ప్ర‌శంస‌లు కురిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బౌల్ రా మామ‌, బాగుంది రా మామ అంటూ తెలుగులో మాట్లాడాడు. స్టంప్ మైక్‌లో రికార్డ్ కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. నితీష్ దెబ్బ‌కు గిల్ కూడా తెలుగు మాట్లాడేస్తున్నాడ‌ని అంటున్నారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ నితీష్ రెడ్డికి చాలా దారుణంగా ఉంది. అతను బ్యాటింగ్‌తో కేవలం 2 పరుగులు మాత్రమే అందించగలిగాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది