Shubman Gill : ఈ వీడియోతో గిల్, సారా లవ్ బయటపడ్డట్టేనా.. జడేజా భలే టీజ్ చేశాడగా..!
ప్రధానాంశాలు:
Shubman Gill : ఈ వీడియోతో గిల్, సారా లవ్ బయటపడ్డట్టేనా.. జడేజా భలే టీజ్ చేశాడగా..!
Shubman Gill : sara tendulkar భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన యువీక్యాన్ ఫౌండేషన్ కోసం ఛారిటీ డిన్నర్‌ను ఏర్పాటు చేయగా, ఈ విందుకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన టీమ్ మొత్తంతో కలిసి వచ్చాడు. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సచిన్ టెండూల్కర్ కుమార్తె sara tendulkar సారా టెండూల్కర్ గిల్‌తో కలిసి కనిపించడం మళ్ళీ చర్చకు దారితీసింది.

Shubman Gill : ఈ వీడియోతో గిల్, సారా లవ్ బయటపడ్డట్టేనా.. జడేజా భలే టీజ్ చేశాడగా..!
Shubman Gill : సీక్రెట్ లవ్..
వైరల్ అవుతున్న ఫోటోలో శుభ్‌మన్ నవ్వుతూ కనిపించాడు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అతని ముందు కూర్చుని ఉంది. అయితే, ఈ ఫోటో గిల్ తన జట్టుతో విందుకు వచ్చినప్పుడు, సారా అప్పటికే అక్కడ ఉన్నప్పుడు తీసినది అని చెబుతున్నారు. సారా టెండూల్కర్ ఈ ప్రోగ్రాం ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అందులో ఆమె తన ఫ్రెండ్స్‌తో కనిపించింది.
అయితే సచిన్ ఫ్యామిలీతో పాటు టీమిండియా ఆటగాళ్లు ఒకే వరుసలో కూర్చోగా, శుభ్‌మన్ గిల్.. సారా టెండూల్కర్ వైపు చూశాడు. కానీ అనూహ్యంగా సారా తల్లి అంజలి అతనివైపు చూడటంతో పక్కనే ఉన్న రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ శుభ్‌మన్ గిల్‌ను ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దాంతో మరోసారి శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.