Siddharth Mallya : ఆర్సీబీ గెలవడంతో చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సిద్ధార్థ్ మాల్యా.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Siddharth Mallya : ఆర్సీబీ గెలవడంతో చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సిద్ధార్థ్ మాల్యా.. వీడియో వైరల్
Siddharth Mallya : ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా కప్పు కొట్టింది రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు . 18 ఏళ్లుగా కలగా ఉన్న టైటిల్ ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది.

Siddharth Mallya : ఆర్సీబీ గెలవడంతో చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సిద్ధార్థ్ మాల్యా.. వీడియో వైరల్
Siddharth Mallya ఎమోషనల్..
మరోవైపు ఒక్కసారీ టైటిల్ గెలవని పంజాబ్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇదిలాఉంటే… 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఆర్‌సీబీ ఐపీఎల్ తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దేశవ్యాప్తంగా రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అందరు సామాజిక మాధ్యమాల ద్వారా జట్టుకు విషెస్ తెలియజేస్తూ తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు.
అయితే ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తూ RCB జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా ఎమోషనల్ అయ్యారు. టీవీలో మ్యాచ్ చూస్తూ ఆయన చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. ఆర్సీబీ ట్రోఫీ సాధించగానే ‘ఆఖరికి కప్పు కొట్టాం’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఎమోషనల్ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Victory celebration by Siddharth Mallya, son of Vijay Mallya, after RCB’s historic win🏆❤️ pic.twitter.com/tSn0VQiCb1
— Sree Harsha (@AapathBandhava) June 3, 2025