SRH : ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆట‌గాళ్లు ఉంటే మేం ఆడం ఇత‌ర టీమ్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SRH : ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆట‌గాళ్లు ఉంటే మేం ఆడం ఇత‌ర టీమ్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  SRH : ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆట‌గాళ్లు ఉంటే మేం ఆడం ఇత‌ర టీమ్స్..!

SRH : గ‌తంలో ఎస్ఆర్హెచ్ టీమ్‌కి ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీంకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్న టీమ్ లైన‌ప్ చూస్తే అవ‌త‌లి టీమ్స్ వ‌ణికిపోతున్నాయి. ముఖ్యంగా బౌల‌ర్స్ గుండెల్లో భ‌యం మొద‌లైంది. అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ వంటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్లు జట్టులో చేర‌డంతో వారిని చూసి ఇత‌ర టీమ్ ఆట‌గాళ్లు భ‌యాందోళ‌న‌కి గుర‌వుతున్నారు.

SRH ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆట‌గాళ్లు ఉంటే మేం ఆడం ఇత‌ర టీమ్స్

SRH : ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆట‌గాళ్లు ఉంటే మేం ఆడం ఇత‌ర టీమ్స్..!

SRH అంతా బాహుబ‌లులే..

గతేడాది జరిగిన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. పటిష్టమైన జట్లను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆ జట్టు , తృటిలో కప్‌ను చేజార్చుకుంది. అయితే క‌ప్ ద‌క్క‌క‌పోయిన కూడా ఆ జ‌ట్టు నిరాశ చెంద‌లేదు. ఈ ఏడాది ప‌క్కాగా కొట్టాల‌నే క‌సితో ఉంది. ఏడాది మారినా ఆ జట్టు తీరు మాత్రం మారలేదు. మరింత బలంగా సన్ రైజర్స్ జట్టు కనిపిస్తోంది.

సన్ రైజర్స్ టీంలో కొత్త‌గా వ‌చ్చిన బ్యాట్స్‌మెన్స్ తీరు పాత వారిలాగానే ఉంది. ఇషాన్ కిష‌న్ ఈ సారి స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టులోకి రాగా, అత‌ను తొలి మ్యాచ్ లో ఎంత విధ్వంసం సృష్టించాడో మ‌నం చూశాం.ఈ క్ర‌మంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాళ్లు . భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే మిగిలిన జట్లు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.మ‌రి ఈ రోజు ల‌క్నో జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌ని ఎలా నియంత్రిస్తుందో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది