Sunrisers Hyderabad : వామ్మో.. ఏంటి విధ్వంసం.. ఈ ఓపెన‌ర్ల‌ను చూసి భ‌య‌ప‌డుతున్న ఐపిఎల్ జ‌ట్లు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sunrisers Hyderabad : వామ్మో.. ఏంటి విధ్వంసం.. ఈ ఓపెన‌ర్ల‌ను చూసి భ‌య‌ప‌డుతున్న ఐపిఎల్ జ‌ట్లు..!

Sunrisers Hyderabad : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ సీజ‌న్‌లో అద్భుతాలు చేస్తుంది. ఏ జ‌ట్టు సాధించ‌లేని రికార్డుల‌ని అవ‌లీల‌గా సాధిస్తుంది. నిన్న రాత్రి లక్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడిన ఎస్ఆర్‌హెచ్ ఒక్క వికెట్ కోల్పోకుండా ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ముందు వ‌చ్చిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌దొక్కుకోలేదు. స‌న్‌రైజ‌ర్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 May 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Sunrisers Hyderabad : వామ్మో.. ఏంటి విధ్వంసం.. ఈ ఓపెన‌ర్ల‌ను చూసి భ‌య‌ప‌డుతున్న ఐపిఎల్ జ‌ట్లు..!

Sunrisers Hyderabad : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ సీజ‌న్‌లో అద్భుతాలు చేస్తుంది. ఏ జ‌ట్టు సాధించ‌లేని రికార్డుల‌ని అవ‌లీల‌గా సాధిస్తుంది. నిన్న రాత్రి లక్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడిన ఎస్ఆర్‌హెచ్ ఒక్క వికెట్ కోల్పోకుండా ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ముందు వ‌చ్చిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌దొక్కుకోలేదు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్స్ నుండి ప‌రుగులు రాబ‌ట్ట‌డం వారికి చాలా క‌ష్టంగా మారింది ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48) కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శించి ప‌రుగులు చేయ‌డంతో ఆ మాత్రం స్కోరు అయిన వ‌చ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Sunrisers Hyderabad : ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం

లక్ష్యఛేదనలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. లక్నో బౌలర్లపై దండయాత్ర చేశారు. బౌండరీలు, సిక్స్‌లతో ఇద్దరూ వీర హిట్టింగ్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో మెరుపు హాఫ్ సెంచరీల మోతమోగించారు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో అద్భుత హిట్టింగ్ చేశాడు. అర్ధ శకతంతో కుమ్మేశాడు. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో హెడ్ ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపాడు. అభిషేక్ శర్మ కూడా తన మార్క్ హిట్టింగ్‍తో సునామీ సృష్టించాడు. 28 బంతుల్లోనే 75 పరుగులతో అభిషేక్ అరిపించేశాడు. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో విజృంభించాడు.

ల‌క్ష్య చేధ‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్స్ వీర‌విహారం చేశారు. వారి సునామి ఇన్నింగ్స్‌కి ల‌క్ష్యం చిన్న‌బోయింది. 5.4 ఓవర్లలోనే హైదరాబాద్ 100 పరుగులు దాటేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ లక్నో బౌలర్లపై విరుచుపడ్డారు. హైదరాబాద్ భీకర ఓపెనర్లను ఎలా అడ్డుకోవాలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‍కు అర్ధం కాలేదు. మొత్తంగా ఇద్దరూ అజేయంగా 58 బంతుల్లోనే 167 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించేశారు. 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి హైదరాబాద్ విజయం సాధించి స‌రికొత్త చరిత్ర సృష్టించింది..ఐపీఎల్‍లో 160 పరుగులకుపైగా లక్ష్యాన్ని 10 ఓవర్లలోపే ఛేదించిన తొలి జట్టుగా హైద‌రాబాద్ రికార్డుల‌లోకి ఎక్కింది. ఈ జ‌ట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును (287 రన్స్) కూడా ఇదే సీజన్‍లో క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

Sunrisers Hyderabad వామ్మో ఏంటి విధ్వంసం ఈ ఓపెన‌ర్ల‌ను చూసి భ‌య‌ప‌డుతున్న ఐపిఎల్ జ‌ట్లు

Sunrisers Hyderabad : వామ్మో.. ఏంటి విధ్వంసం.. ఈ ఓపెన‌ర్ల‌ను చూసి భ‌య‌ప‌డుతున్న ఐపిఎల్ జ‌ట్లు..!

ఈ మ్యాచ్‍‍లో హెడ్, అభిషేక్ కుమ్ముడుతో లక్నో బౌలర్లందరూ భారీ పరుగులు సమర్పించుకున్నారు. యశ్ ఠాకూర్ 2.4 ఓవర్లలో 47 రన్స్ ఇస్తే.. నవీనుల్ హక్ 2 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చుకున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా ఇదే రేంజ్‍లో రన్స్ ఇచ్చారు. ఇక భారీ విజ‌యంతో స‌న్ రైజ‌ర్స్ మూడో స్థానానికి చేరుకుంది. 12 మ్యాచ్‍ల్లో 7 గెలిచి 14 పాయింట్లను సొంతం చేసుకుంది. లీగ్ దశలో హైదరాబాద్‍కు మరో రెండు మ్యాచ్‍లు మిగిలి ఉన్నాయి. ఒకటి గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉంటాయి. లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‍ల్లో 6 గెలిచి, 6 ఓడింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఘోరంగా ఓడటంతో -0.76కు ఆ జట్టు నెట్‍రన్ పడిపోయింది. ఈ జ‌ట్టుకి ప్లే ఆఫ్ ఆశ‌లు క్లిష్టంగానే మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది