Surya Kumar Yadav : అతని తర్వాత నేనే.. రోహిత్ శర్మపై సూర్య కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్…!
Surya Kumar Yadav : ప్రస్తుతం టీమిండియా క్రికెట్ టీం లో విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న క్రికెటర్ ఎవరు అంటే సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి. చాలామంది అభిమానులు ఈయనను స్కై అని ముద్దుగా పిలుస్తారు. తన 360 డిగ్రీ ఆటతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. మహిళా ఆర్డర్లో టీమిండియా జట్టుకు ఇతడే వెన్నుముక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటీవల […]
Surya Kumar Yadav : ప్రస్తుతం టీమిండియా క్రికెట్ టీం లో విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న క్రికెటర్ ఎవరు అంటే సూర్య కుమార్ యాదవ్ అని చెప్పాలి. చాలామంది అభిమానులు ఈయనను స్కై అని ముద్దుగా పిలుస్తారు. తన 360 డిగ్రీ ఆటతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. మహిళా ఆర్డర్లో టీమిండియా జట్టుకు ఇతడే వెన్నుముక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటీవల జరిగిన టి20లో సూర్య కుమార్ చేసిన విధ్వంసానికి న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్ సన్ సైతం ఉలిక్కిపడ్డాడు. అలాగే సూర్య కుమార్ ఆడిన షాట్లు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని కేన్ మామ చెప్పాడంటే సూర్య సత్తా ఏంటో అర్థం అవుతుంది. సౌత్ ఆఫ్రికా లో విధ్వంసకరంగా ఆడే మాజీ క్రికెటర్ ఏపీ డివిలియర్స్ స్టైల్లో 360 డిగ్రీ ఆటతో సూర్యకుమార్ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అతడే ఫైర్ బ్రాండ్. అయితే ఐపీఎల్ లీగ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడి వెలుగులోకి వచ్చిన సూర్య కుమార్, ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. అయితే ఐపీఎల్ లో అదరగొట్టినప్పటికీ సూర్యకుమార్ కు జాతీయ జట్టులో వెంటనే అవకాశం అందలేదు. అంతేకాదు సూర్యకుమార్ కు టీమిండియా తరఫున ఆడే అవకాశం చాలా ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఆడుతూ వాయించేస్తున్నాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ లో మూడు హాఫ్ సెంచరీలకు దాకా కొట్టి సత్తా చాటుకున్నాడు సూర్య కుమార్. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన టి20 లో దుమ్ములేపాడు. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయినప్పటికీ , రెండో మ్యాచ్లో సెంచరీ కొట్టి న్యూజిలాండ్ బౌలర్స్ ను , ఆడుకున్నాడు.
51 బంతుల్లో 111 పరుగులు చేసి టి20 సిరీస్లో తన రెండో సెంచరీని పూర్తి చేస్తున్నా డు. సూర్యకుమార్ దాటికి టీమిండియా ఆ సిరీస్ ను 1-0 తో సొంతం చేసుకుంది. టి20 మ్యాచ్లలో బౌలర్స్ ను ఆడుకుంటున్న సూర్య కుమార్ వన్డే మ్యాచ్లలో కూడా సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్నాడు. అయితే మొదటిగా జరిగిన వన్డే మ్యాచ్లో నిరాశపరిచినప్పటికీ, రెండో వన్డేలో ఎలాగైనా రాణించాలని పట్టుదలతో , ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్య కుమార్ రెండో వన్డేలకు ముందు మీడియాతో మాట్లాడి ఆసక్తికరమైన విషయాలను కు స్పందించాడు. ఇక సూర్యకుమార్ కు టీమిండియా కెప్టెన్ నుండి ఏదైనా దొంగలించాల్సి వస్తే ఏం దొంగతనం చేస్తావని అడగగా రోహిత్ శర్మ ఫుల్ షాట్ ను దొంగలిస్తానని సమాధానం ఇచ్చాడు. సూర్య కుమార్ రోహిత్ శర్మ ఫుల్ షర్ట్ పై మనసు పారేసుకున్నట్లు అర్థమవుతుంది. రోహిత్ శర్మ ఫుల్ షార్ట్ ను అంత అద్భుతంగా ఆడతాడో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.